అక్కినేని నటవారసుల పెళ్ళి భాజాలు మోగనున్నాయి. డిసెంబరులో నాగచైతన్య, అఖిల్ వివాహానికి ముహూర్తం ఖరారు చేస్తూ నిశ్చితార్థం జరుగనుంది. అక్కినేని నాగార్జున తనయుల ఎంగేజ్‌మెంట్ తేదీని ప్రకటించారు. అఖిల్ కోరిక మేరకే డిసెంబర్ 9న నిశ్చితార్థం ఏర్పాటు చేయనున్నట్లు నాగార్జున తెలిపారు. శ్రేయా భూపాల్ అనే ఫ్యాషన్ డిజైనర్‌తో అఖిల్ ప్రేమలో ఉన్న నేపథ్యంలో, నాగచైతన్య సమంతను వివాహం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు.
ఇప్పటికే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా చైతూ, అఖిల్ వివాహం మారిపోయింది. ఇద్దరి పెళ్లి వేడుక ఒకే సారి జరుగనున్నందున అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ ఖుషీగా ఉన్నారు. తాజాగా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. అందులో ఒకటే అమల- సమంత ఫోటో. ఈ ఫోటోకు సోషల్ మీడియాలో అమాంతమైన క్రేజ్ కొట్టేసింది. లైక్స్, షేర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఫోటోలో ఎన్నో అర్థాలు కనిపిట్టేయొచ్చు.. ఆ ఫోటోను మీరూ చూడండి.