Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుల్లో నటి రమ్య.. బ్రిటీష్ వారికి సహకరించిన ఆర్ఎస్ఎస్.. ప్రైవేట్ పిటీషన్ దాఖలు

కన్నడ నటి రమ్య మరోమారు చిక్కుల్లో పడ్డారు. బ్రిటీష్ వారికి ఆర్ఎస్ఎస్ నేతలు సహకరించారంటూ ఆరోపించారు. దీనిపై బెంగుళూరుకు చెందిన ఓ న్యాయవాది ప్రైవేట్ పిటీషన్‌ను దాఖలు చేశారు.

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2016 (13:33 IST)
కన్నడ నటి రమ్య మరోమారు చిక్కుల్లో పడ్డారు. బ్రిటీష్ వారికి ఆర్ఎస్ఎస్ నేతలు సహకరించారంటూ ఆరోపించారు. దీనిపై బెంగుళూరుకు చెందిన ఓ న్యాయవాది ప్రైవేట్ పిటీషన్‌ను దాఖలు చేశారు. పాకిస్థాన్ నరకం కాదంటూ ఇటీవల రమ్య చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం చల్లారక ముందే ఆమె తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో నటి రమ్యపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... ఆర్ఎస్ఎస్ బ్రిటీష్ వారికి స‌హ‌క‌రించారంటూ రమ్య చేసిన వ్యాఖ్యలపై వసంత్ మరకడ అనే న్యాయవాది ప్రయివేట్ పిటిషన్ దాఖలు చేశారు. రమ్యపై చర్య తీసుకోవాలని ఆయన మంగళూరు సమీపంలోని బెల్తాన్ గడి కోర్టులో పిటిషన్లో కోరారు. 
 
అయితే అంతకుముందు ఆయన రమ్యపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసేందుకు అంగీకరించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. వసంత్ స్టేట్మెంట్ను రికార్డు చేసిన కోర్టు రమ్యపై క్రిమినల్ కేసు నమోదు ఆదేశాలు ఇచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రమ్యకు సమన్లు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments