Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాట్యం ఎందుకు తీశార‌నే వారికి ఇదే జ‌వాబుః సంధ్యా రాజ్‌

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (16:21 IST)
Sandhya Raj
కూచిపూడి న‌ర్త‌కి సంథ్యారాజ్ నిర్మించి, టైటిల్ రోల్ ప్లే చేసిన సినిమా `నాట్యం`. రేవంత్‌ ద‌ర్శ‌కుడు. 2020లో సెన్సార్ అయి క‌రోనా వ‌ల్ల ఆగిపోయిన ఈ సినిమా ఈ ఏడాది విడుద‌లైంది. ఈ సినిమా థియ‌ట‌ర్ల క‌లెక్ష‌న్ల‌కంటే అవార్డు ద‌క్కించుకుంది. 52వ అంత‌ర్జాతీయ చ‌ల‌న‌చిత్రోత్స‌వం, గోవాలో ఈ సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు ఎంపికైంది. 
 
ఈ సంద‌ర్భంగా సంధ్యారాజ్ మాట్లాడుతూ, ఈ సినిమా ఏడాదిపాటు ప్ర‌మోష‌న్ చేశాం. ప్ర‌జ‌ల‌కు మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు అనుగుణ‌మైన సినిమా వ‌స్తుంద‌ని చెప్పాను. మా కుటుంబంతోపాటు చాలామంది స్టార్లు బిజినెస్‌, డాన్స్ రంగంలో వున్న మీరు ఎందుకు సినిమా తీశార‌ని అని అడిగారు. అప్పుడు చెప్పినా ఎవ్వ‌రికీ స‌రిగ్గా అర్థం కాలేదు. ఇప్పుడు ఫెస్టివ‌ల్‌లో ఎంపిక‌వ్వ‌డమే అంద‌రికీ జ‌వాబు దొరికింది అనుకుంటున్నా. మ‌న కూచిపూడి డాన్స్ అంత‌ర్జాతీయ స్థాయిలో అంద‌రికీ చేరువవ్వాల‌నే కోరిక తీరింది. నాకు గ‌ర్వంగా వుంద‌ని తెలిపారు.
 
నాకు గ‌ర్వంగా వుందిః రేవంత్‌
చిత్ర ద‌ర్శ‌కుడు రేవ‌త్ మాట్లాడుతూ,  ఒకే ఒక తెలుగు సినిమా నాట్యం  ఇండియ‌న్ ప‌నోర‌మాలో గోవా ఫెస్టివ‌ల్‌లో ఎంపికైంది. ఈ సంద‌ర్భంగా ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ బ్రాండ్ కాస్టింగ్ వారికి ధ‌న్య‌వాదాలు. జాతీయ‌స్థాయిలో ప‌లు భాష‌ల్లో సినిమాలు వ‌చ్చినా జ్యూరీని మెప్పించ‌డం గ‌ర్వంగా వుంది అని తెలిపారు.
 
క‌మ‌ల్‌కామ‌రాజు మాట్లాడుతూ, మంచి సినిమాలో భాగ‌మైనందుకు ఆనందంగా వుంది. 12 ఏళ్ళ త‌ర్వాత ఓ తెలుగు సినిమా ఎంపిక కావ‌డం ఆనందంగా వుంది. నాట్యం సినిమా త్వ‌ర‌లో ఓటీటీలో కూడా రాబోతోంది అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments