Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూర్తి భాధ్యత నాదే : రేవంత్

Advertiesment
పూర్తి భాధ్యత నాదే : రేవంత్
, మంగళవారం, 2 నవంబరు 2021 (20:37 IST)
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం దిశగా సాగిపోతుండగా కాంగ్రెస్ పార్టీ చతికలపడింది. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆపార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డిపై అనేక ఆశలు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు పెట్టుకున్నారు. అయితే ప్రస్తుత హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వారి ఆశలకు అనుగుణంగా ఫలితాలు రాలేదు.
 
ముఖ్యంగా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 60 వేల ఓట్లను సాధించింది. అయితే ఆ పార్టీ నుండి పోటి చేసిన పాడి కౌశిక్ రెడ్డి పార్టీకి చెక్ పెట్టి.. అధికార టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు... దీంతో ఆ పార్టీకి అభ్యర్థి కరువైన పరిస్థితి కనిపించింది. 
 
అయితే రేవంత్ రెడ్డి అధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత పార్టీ పరిస్థితులు మారతాయని భావించారు. కాని రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలపై దృష్టి సారించలేదు.. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఆ పార్టీ అభ్యర్థులను ముందే ప్రకటించిన ఎన్నికలకు కేవలం పదిరోజుల క్రితమే కాంగ్రేస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. 
 
దీంతో పూర్తిగా హుజూరాబాద్ ఉప ఎన్నికలను పట్టించుకోని విధంగానే రేవంత్ రెడ్డి వ్యవహరించారు. ఓ వైపు ఉప ఎన్నికలు ఉన్నా.. మరోవైపు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహించారు. కాని హుజూరాబాద్ వైపు చూడలేదు..
 
అయితే ప్రస్థతల పలితాల్లో కనీసం ఇండిపెండెండ్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు.. మొత్తం పోలైన రెండు లక్షల ఓట్లలో కనీసం రెండు శాతం కూడా సాధించలేని పరిస్థితి కనిపించింది. దీంతో ఆ పార్టీలో అంతర్గత పోరు ప్రారంభమైంది. 
 
ఈ పరిస్థితి రేవంత్ రెడ్డి కారణమని ఆ పార్టీ నేతలు జగ్గారెడ్డితోపాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటీ వాళ్లు ఆయనపై విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో ఎన్నికల ఫలితాలపై రేవంత్ రెడ్డి స్పందించారు.
 
ఎన్నికల ఫలితాల్లో పూర్తి భాద్యత తనదే అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలాంటీ నిరాశకు లోను కావాల్సిన అవసరం లేదని అన్నారు. 
 
తనకు ఇంకా వయస్సు ఉందని పార్టీని 20 సంవత్సరాల పాటు పార్టీని ముందుకు తీసుకుని పోయి అధికారంలోకి తీసుకుపోతానని చెప్పారు. ఒక ఓటమిపై పార్టీలో సమీక్ష చేసుకుంటామని .. మరో రెండు రోజుల తర్వాత పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్టు చెప్పారు. 
 
ఇక సీనియర్లు మాట్లాడిన వాటిపై ఆయన స్పందించలేదు ఇక ఎన్నికల్లో పోటి చేసిన బల్మూరి వెంకట్‌కు పార్టీలో భవిష్యత్ ఉంటుందని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండియాలో భగ్గుమంటున్న పెట్రోలు ధరలు