Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్ష‌య్ కుమార్ పారితోషికం బ‌య‌ట‌పెట్టిన నిర్మాత‌

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (17:28 IST)
Akshay Kumar, Kangana
బాలీవుడ్‌లో పారితోషికంలో టాప్‌లో వున్న‌ది అక్ష‌య్ కుమార్ అన్న‌వి విష‌యం తెలిసిందే. అయితే కోవిడ్ టైంలో కూడా అంత భారీ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడా! అనేది చ‌ర్చ‌గా మారింది. అప్పుడ‌ప్పుడు బాలీవుడ్ హీరో హీరోయిన్ల పారితోషికాలు బ‌య‌ట‌ప‌డుతుంటాయి. తాజాగా అక్ష‌య్ కుమార్ ఎంత తీసుకుంటున్నాడో అనేది నిర్మాత వాషు భగ్నాని తెలియ‌జేశాడు. తాజాగా అక్ష‌య్ కుమార్ న‌టిస్తున్న సినిమా భ‌డేమియా ఛోటేమియా. ఈరోస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌పై రూపొందుతోన్న  ఈ సినిమాకు అక్ష‌య్‌కుమార్‌కు 160 కోట్లు పారితోషికంగా ఇచ్చిన‌ట్లు నిర్మాత వాషు భగ్నాని బ‌య‌ట పెట్టాడు. దీంతో బాలీవుడ్‌లో ఈ విష‌య‌మై హాట్ టాపిక్‌గా మారింది.
 
ఈ విష‌యంతెలిసిన సినీగోయ‌ర్లు అక్ష‌య్‌కు ఇచ్చే పారితోషికంతో భోజ్ పూరిలో 10 సినిమాలు తీయ‌వ‌చ్చ‌ని సోష‌ల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మ‌రోవైపు అక్ష‌య్ కుమార్ క‌రోనా టైంలోనూ అంత‌కుముందు కూడా కోట్ల రూపాయ‌ల‌ను స‌మాజ సేవ‌కు కేటాయించిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు.
బాలీవుడ్‌లో హీరో హీరోయిన్ల పారితోషికాలు ఇలా వున్నాయంటూ బ‌య‌ట‌కు వ‌చ్చాయి.
 
టైగ‌ర్ ష్రాఫ్ 40కోట్లు, ఇంత‌కుముందు 20 నుంచి 30 కోట్లు తీసుకునే ఆయ‌న ఇప్పుడు బ‌డేమియా.. కు 40 కోట్లు తీసుకుంటున్నాడ‌ట‌. ద‌ర్శ‌కుడు అలియా అబ్బాస్ 25కోట్లు, మిగిలిన న‌టీన‌టుల‌కు 100 కోట్లు వెర‌సి మొత్తం సినిమాకు 250 కోట్లు బ‌డ్జెట్ కేటాయించార‌ట‌.
 
ఇక స‌ల్మాన్ ఖాన్ శాటిలైట్ రైట్స్‌తో క‌లిపి 100 కోట్లు, అమీర్ ఖాన్ 150 కోట్లు,  షారూఖ్ ఖాన్ ప్ర‌స్తుతం సినిమాలు దూరంగా వున్నా 100కోట్లు, అజ‌య్‌దేవ్‌గ‌న్‌కు 100 కోట్లు, హృతిక్ రోష‌న్ 110 కోట్లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.
 
ఇక హీరోయిన్ల‌ప‌రంగా చూస్తే, కాంట్ర‌వ‌ర్సీల‌తో ఫేమ‌స్‌గా వున్న కంగ‌నా ర‌నౌత్ 20 కోట్లు, దీపికా పదుకొనే 14, ఐశ్వ‌ర్యారాయ్ 14, క‌రీనా, క‌త్రినా కైఫ్‌లు 12 కోట్లు, అలియా భ‌ట్‌కు 12కోట్లు పారితోషికం ద‌క్కుతుంద‌ని బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments