Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కినేని కుటుంఒంతో మా జర్నీ ఇలాగే కొన సాగుతుందిః అల్లు అర్జున్

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (14:04 IST)
Arjun-Akhil-Pooja
`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న అఖిల్ కు శుభాకాంక్ష‌లు. అఖిల్ ని చూస్తే నాకు యంగర్ బ్రదర్ లా అనిపిస్తుంది. అఖిల్ సినిమా రాకముందే నేను నాగార్జున సార్ ని కలిశాను అఖిల్ ని ఇలా చేస్తే బాగుంటుందా! అనేసి నా చిన్న సలహా ఇచ్చి కలవడం జరిగింది. ఇష్టం ఉంది కాబట్టే వేరే ఫ్యామిలీ హీరో అయినా కూడా నేను వెళ్లి చెప్పడం జరిగింది. అలాంటి అఖిల్ కి ఈ రోజు ఇంత పెద్ద హిట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది` అని అల్లు అర్జున్ అన్నారు.
 
అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ పతాకంపై అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంట‌గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ విజ‌య‌వంత స‌భ హైద‌రాబాద్‌లో నిన్న రాత్రి జ‌రిగింది. ఈ వేడుక‌లో అల్లు అర్జున్ ప‌లు విష‌యాలు మాట్లాడారు.
 
అల్లు అర్జున్ మాట్లాడుతూ, అఖిల్ చాలా బాగా డాన్స్ చేస్తాడు, బాగా ఫైట్ చేస్తాడు ఇవన్నీ చేయగలిగి కూడా మంచి ఫ్యామిలీ సబ్జెక్టు ను సెలెక్ట్ చేసుకొని మంచి క్యారెక్టర్ ఉన్న సినిమా చేశాడు. అందుకే ఈరోజు ఈ సినిమా  ఇంత బాగా రావడానికి కారణమైంది. తను ఎన్నుకున్న కథ చాలా బాగుంది. మా నాన్నగారు చెప్పినట్టు ఎక్కడున్నా అక్కినేని నాగేశ్వరరావు గారు మా తాత  అల్లు రామలింగయ్య గారు ఈ సక్సెస్ ను చూస్తుంటారు. అక్కినేని ఫ్యామిలీ తో మా ప్రయాణం చాలా సంవత్సరాలుగా సాగుతుంది. ఫ్యూచర్ లో కూడా మా జర్నీ అలాగే కంటిన్యూ సాగుతుంది. లవ్ స్టోరీ సినిమా ద్వారా చైతన్య, ఇపుడు అఖిల్ ఇద్దరూ మంచి సక్సెస్ ను అందుకున్నారు. ఇద్దరు బ్రదర్స్ కూడా ఒకే సీజన్ లో సూపర్ హిట్ కొట్టారు. వీరిద్దరికీ కంగ్రాచులేషన్. 
 
పూజాను నేను డీజే నుంచి చూస్తున్నాను సినిమా తర్వాత సినిమా తన పెర్ఫార్మన్స్ తో బెటర్మెంట్ ఇస్తూ ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ చాలా హార్డ్ వర్కర్,  వాసు వర్మ ఈ సినిమాకు చాలా సపోర్ట్ గా నిలిచారు. గోపి సుందర్ కి తెలుగు రాకపోయినా చాలా అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. బన్నీ వాసు మరొక బిగ్ హిట్ ని అందు కున్నాడు. ఈ మధ్యకాలంలో బన్నీ వాసు ఇంత కష్టపడడం నేను చూడలేదు. మా నాన్నగారిని నేను నలభై సంవత్సరాలుగా చూస్తున్నాను ఆయన ఎప్పుడు కష్ట పడుతూనే ఉంటాడు.మా ఫాదర్ పెద్ద, పెద్ద స్టార్ హీరోలతో, కొత్త వాళ్లతో తర్డ్ జనరేషన్ హీరోస్ తో ఇలా అందరితో పని చేస్తూ మంచి కథలతో బెస్ట్ మూవీస్ ఇస్తున్నాడు. టీం అంతా ఎంతో కష్టపడి  మెమరబుల్ ఫిల్మ్ ఇచ్చారు. మంచి సినిమా తీస్తే థియేటర్లకు జనాలు వస్తారని ఈ సినిమా నిరూ పించింది.ఇంత  పెద్ద విజయం అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments