Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ బ‌ర్త్‌డే చాలా స్పెష‌ల్ః అమ్రిన్ ఖురేషి.

Amrin Qureshi
Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (08:14 IST)
Amrin Qureshi
హైద‌రాబాద్ బ్యూటి అమ్రిన్ ఖురేషి రెండు బాలీవుడ్ భారీ చిత్రాల్లో నటిస్తోన్న పక్కాహైదరాబాదీ. తెలుగులో సూపర్‌హిట్‌ అయిన 'సినిమా చూపిస్తమావ' చిత్రాన్ని 'బ్యాడ్‌బాయ్‌' పేరుతో బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీలో ప్రముఖ నటుడు వెట‌రన్ హీరో మిథున్‌ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి స‌ర‌స‌న హీరోయిన్‌గా అమ్రిన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు  రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వంలో ఇన్‌బాక్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై సాజిద్‌ ఖురేషి నిర్మిస్తున్నారు. అలాగే  అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన సూపర్‌హిట్‌ మూవీ`జులాయి` హిందీ రీమేక్‌లో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సూపర్‌ డైరెక్టర్‌ టోని డిసౌజ తెర‌కెక్కించ‌నున్నారు. ఆదివారం ఆమె పుట్టిన‌రోజును సెట్లో జ‌రుపుకుంది.
 
``హీరోయిన్‌గా జ‌రుపుకుంటోన్న ఫ‌స్ట్ బ‌ర్త్‌డే ఇది నాకు చాలా స్పెష‌ల్‌. ఇటీవ‌ల అన్న‌పూర్ణ సెవెన్ ఎక‌ర్స్‌లో వేసిన గ్రాండ్ సెట్లో `బ్యాడ్‌బాయ్` సాంగ్ షూట్ చేశాం.  ఒక సాంగ్ మిన‌హా మిగ‌తా షూటింగ్ పూర్త‌య్యింది. అలాగే త్వ‌ర‌లో `జులాయి`మూవీ షూటింగ్ ప్రారంభంకాబోతుంది.

హైద‌రాబాద్ అమ్మాయిగా బాలీవుడ్‌లో బిజీ అవ‌డం చాలా సంతోషంగా ఉంది. సౌత్‌లో కూడా మంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి.. ప్ర‌స్తుతం డిస్కర్ష‌న్ స్టేజ్ లో ఉన్నాయి. త్వ‌ర‌లోనే వాటి వివ‌రాలు తెలియ‌చేస్తాను. త‌ప్ప‌కుండా ఇది నాకు బెస్ట్ ఇయ‌ర్ అవుతుంద‌ని ఆశిస్తున్నాను`అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments