Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

చిత్రాసేన్
శనివారం, 27 సెప్టెంబరు 2025 (18:21 IST)
Kiran Abbavaram, Yukthi Tareja, Naresh, Jains Nani
కె ర్యాంప్ మూవీని మేమంతా చూశాం. సినిమా చూస్తూ అన్ని ఎజ్ గ్రూప్స్ వాళ్లం చాలా ఎంజాయ్ చేశాం. సినిమా సక్సెస్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఈ దీపావళికి థియేటర్స్ కు వచ్చే అన్ని వర్గాల ప్రేక్షకులను కె ర్యాంప్ ఎంటర్ టైన్ చేస్తుంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఇది. మా టీమ్ అంతా బాగా సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్ వల్లే సెట్స్ లో ఎంతో కంఫర్ట్ గా షూటింగ్ చేశాం. కథలో ఉన్న ఫన్ ను సెట్స్ లోనూ ఫీల్ అయ్యాం. మళ్లీ కాలేజ్ కు వెళ్లిన వైబ్ కలిగింది.. అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు.
 
ఈ సినిమాను ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా  నిర్మించారు. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా గురించి వివరాలు తెలియజేస్తూ చిత్ర యూనిట్ మీట్ ఏర్పాటు చేసింది.
 
ఇంకా కిరణ్ అబ్బవరం తెలుపుతూ - నాతో ఈ మూవీ చేసిన ప్రొడ్యూసర్స్, రాజేశ్, శివ గారికి థ్యాంక్స్. హీరోయిన్ యుక్తికి హీరోతో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ఉంది. తన పర్ ఫార్మెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ మూవీలో నేను చిల్లరగా ఉంటా, యుక్తి క్యారెక్టర్ పిచ్చిది. వీళ్లిద్దరు కలిస్తే ఎంత ఫన్ క్రియేట్ అవుతుందో థియేటర్స్ లో చూస్తారు. ప్రమోషనల్ కంటెంట్ లో ఇప్పటికే మీరు చూసి ఉంటారు. ఇలాంటి పిచ్చి గర్ల్ ఫ్రెండ్ ఉంటే మీకు కూడా బూతులు వస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ తో నా మూడో చిత్రమిది. ఎస్ఆర్ కల్యాణమండపం, వినరో భాగ్యము విష్ణు కథ తర్వాత కె ర్యాంప్ చేస్తున్నాడు. ఆర్ఆర్ తో మూవీ చూశాక చాలా హ్యాపీగా ఫీలయ్యా. నరేష్ గారు, సాయి కుమార్ గారు..ఇలా మా ఆర్టిస్టులంతా సెట్ లోకి రాగానే ఒక సూపర్ హిట్ మూవీకి వర్క్ చేస్తున్నామనే ఫీల్ తో షూటింగ్ చేశాం. నరేష్ గారు ఎనర్జిటిక్ గా పర్ ఫార్మ్ చేశారు. మా జైన్స్ నాని మహేశ్ ఫ్యాన్, నేను పవన్ కల్యాణ్ ఫ్యాన్. ఈ ఇద్దరు ఫ్యాన్స్ మధ్య ఉండే వార్ చాలా స్పెషల్. మళ్లీ వాళ్లే మంచి ఫ్రెండ్స్ అవుతారు. అలా నేను జైన్స్ నాని ఫ్రెండ్స్ అయ్యాం. తను కథ చెబుతున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నా. 
 
ఈ జర్నీలో నాని నాకొక బ్రదర్ అయ్యాడు. అతన్ని చూస్తేనే నవ్వొస్తుంది. కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ తో మూవీ చేసి ఒక వైబ్ క్రియేట్ చేయాలి అనుకున్నాం. అలాగే సినిమా చేశాం. ఈ చిత్రంలో కుమార్ క్యారెక్టర్ ప్లే చేసేప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఒకట్రెండు డైలాగ్స్ చూసి సినిమాపై అభిప్రాయానికి రాకండి. నా మూవీ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది అది నా గ్యారెంటీ. ఎక్కడా ఇబ్బంది పడరు. డబ్బున్న కుర్రాడు జాలీ లైఫ్ గడపాలని అనుకుంటాడు. ఒక క్రేజ్ క్రియేట్ చేసేందుకే ఆ ఎలిమెంట్ ను ప్రమోట్ చేస్తున్నాం. పండుగ నాలుగు రోజులు వస్తుంది. ఫ్యామిలీతో కలిసి చూసి కె ర్యాంప్ మూవీని ఎంజాయ్ చేస్తారు. నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి, వెంకీ, రెడీ..ఇలాంటి ఎంటర్ టైనర్స్ లా మా కె ర్యాంప్ చిత్రాన్ని రిపీటెడ్ గా చూడాలని అనుకుంటారు. గత దీపావళికి అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. ఈ సారి మా కె ర్యాంప్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంతో మీకు కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ దక్కుతుంది. నేను మాటిస్తున్నా. అన్నారు.
 
డైరెక్టర్ జైన్స్ నాని మాట్లాడుతూ -  నువ్వు ఎంత స్క్రిప్ట్ లో రాస్తే ఎంత పర్ ఫార్మ్ చేస్తా అని కిరణ్ అన్న ఎంకరేజ్ చేసేవారు. నరేష్ కి క్యారెక్టర్ చెప్పేందుకు వెళ్లినప్పుడు భయపడ్డా. ఆయన స్క్రిప్ట్ విని తప్పకుండా చేస్తానని అన్నారు. కె ర్యాంప్ అంటే బూతు మాట కాదు. కె ర్యాంప్ అంటే కిరణ్ అబ్బవరం ర్యాంప్. అది దృష్టిలో పెట్టుకునే కథ రాశాను, సినిమా రూపొందించాను. థియేటర్స్ లో సినిమా చూస్తున్నప్పుడు కూడా కిరణ్ అబ్బవరం ర్యాంప్ అనే అనుకుంటారు అన్నారు.
 
యాక్టర్ నరేష్ మాట్లాడుతూ -కిరణ్ నాకొక సోదరుడిలా అనిపించాడు. హీరోయిన్ యుక్తికి ఈ సినిమా తర్వాత చాలా మంచి పేరు వస్తుంది. అవకాశాలు బాగా పెరుగుతాయి. తను అంత బాగా పర్ ఫార్మ్ చేసింది. ఈ చిత్రంలో నాకొక కొత్త తరహా రోల్ ఇచ్చారు. ఇప్పటిదాకా నేను అలాంటి క్యారెక్టర్ చేయలేదు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments