Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్తుండే పాత్రలే నా క‌లః కిరణ్ అబ్బవరం

Webdunia
బుధవారం, 14 జులై 2021 (16:19 IST)
Kiran Abbavaram
తెలుగు ఇండస్ట్రీకి ఎంతోమంది నటులు వస్తుంటారు. కానీ అందులో కొందరు మాత్రమే గుర్తుండిపోతుంటారు. అలా తనకు కూడా తెలుగు ప్రేక్షకులు గుర్తింపు ఇచ్చినందుకు ధన్యావాదాలు తెలుపుతున్నారు హీరో కిరణ్ అబ్బవరం. ‘రాజావారు రాణిగారు’తో హీరోగా పరిచయం అయిన ఈయన.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రెండో ప్రయత్నంగా ‘SR కళ్యాణమండపం’ సినిమా చేసారు కిరణ్. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు కూడా ఈయనే అందించడం విశేషం. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యం అంటున్నారు.
 
సాఫ్ట్‌వేర్ నుంచి సినిమాపై ప్యాషన్‌తో ఇక్కడికి వచ్చారు ఈయన. తెలుగు ప్రేక్షకులు తనను చాలా బాగా ఆదరిస్తున్నారని తెలిపారు కిరణ్. తొలి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత రెండో సినిమా కోసం గ్యాప్ తీసుకున్నారు. ఎప్పటికీ గుర్తుండిపోయే మంచి పాత్రలు చేయాలనేది తన డ్రీమ్ అంటున్నారు కిరణ్ అబ్బవరం. జులై 15న ఈయన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పుకొచ్చారు కిరణ్ అబ్బవరం. 
 
‘SR కళ్యాణమండపం’ సినిమా గ్లింప్స్ బుధ‌వార‌మే విడుద‌లైంది. అలాగే ‘సెబాస్టియన్’ సినిమా పోస్టర్ కూడా విడుదల కానుంది. జులై 15 ఉదయం 10.05 నిమిషాలకు ‘సమ్మతమే’ సినిమా  ఫస్ట్ లుక్ విడుదల కానుంది. అదే రోజు ఉదయం 9 గంటలకు కిరణ్ అబ్బవరం 5వ సినిమా అనౌన్స్‌మెంట్ కూడా ఉండబోతుంది. ఈ మేరకు తనను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు, దర్శక నిర్మాతలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు కిరణ్ అబ్బవరం. ఈయన నటించిన ‘SR కళ్యాణమండపం’ సినిమా ఆగస్ట్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments