Webdunia - Bharat's app for daily news and videos

Install App

భగవద్గీత, బైబిల్ ఖురాన్‌లోనూ అంద‌మైన ప్రేమ‌క‌థ వుంది- ద‌ర్శ‌కుడు వెంకట్

Webdunia
సోమవారం, 18 జులై 2022 (16:57 IST)
Tej Kurapathi, Akhila Akarshana and others
`హుషారు` ఫేమ్ తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ జంట‌గా న‌టించిన చిత్రం "నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా. ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యంలో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. ఆగష్టు 19 న విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. 
 
ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకులు సముద్ర మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రోమో సాంగ్ చూస్తుంటే వర్షంలో కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే "నువ్వు వస్తానంటే నే వంద్దంటానా" సినిమాల్లో పాట గుర్తుకు వస్తుంది. ఆగస్టు 19 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు..
 
చిత్ర దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ.. రావణాసురుడికి తన భార్య మండోదరి పై ఉన్న ప్రేమ , రాముడికి సీత పై ఉన్న ప్రేమ , దశరథుడుకు తన కొడుకు మీద నమ్మకం ఇలా ప్రతి ఒక్కరిది అందమైన ప్రేమ. భగవద్గీత, బైబిల్ ఖురాన్ లలో అందమైన, పవిత్ర మైన ప్రేమ ఎలా ఉంటుందో ఈ సినిమాలో కూడా అంతే అందమైన పవిత్రమైన ప్రేమను చూయించడం జరిగింది.లవ్ స్టోరీస్ అంటే  అమ్మాయి వెంట అబ్బాయి, లేకపోతె అబ్బాయి వెంట అమ్మాయి పడి లవ్ చేసేలా  కాకుండా ఈ సినిమా రెగ్యులర్ స్టోరీలా కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా అద్భుతంగా ఉంటుంది  సందీప్ గారు అద్భుత మైన మ్యూజిక్ ఇచ్చారు. ఆగష్టు 19 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
 
చిత్ర నిర్మాత ముల్లేటి కమలాక్షి  మాట్లాడుతూ..ఇక్కడకు వచ్చిన పెద్దలందరికి ధన్యవాదములు. ఈ చిత్రాన్ని ద్వారకా తిరుమలైన చిన్న తిరుపతిలో షూటింగ్ చేయడం జరిగింది. అనుకున్న టైమ్ కు, అనుకున్న బడ్జెట్ లో ఈ సినిమా తీశాము. ఇందులో నటించిన హీరో, హీరోయిన్ లకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుతున్నాను. అలాగే పెద్దలు తనికెళ్ళ భరణి గారికి, జీవా గారికి ఇలా అందరూ బాగా నటించడమే కాకుండా వారంతా సపోర్ట్ చేయడం వలెనే సినిమా బాగా వచ్చింది. టెక్నిషియన్స్ అందరూ డెడికేటెడ్ వర్క్ చేశారు. అందరికీ నా ధన్యవాదములు.. నన్ను నిర్మాతగా పరిచయం చేసిన మా తల్లి తండ్రులు ముల్లేటి నాగేశ్వరావు, ముల్లేటి జానకి గార్లకు ధన్యవాదములు అన్నారు.
 
హీరో తేజ్ కూర‌పాటి మాట్లాడుతూ..మంచి కాన్సెప్ట్ తో వస్తున్న నా వెంట పడుతున్న చిన్న వాడెవడమ్మా  సినిమా ఆగష్టు 19 న విడుదల అవుతుంది. ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
 
హీరోయిన్ అఖిల ఆక‌ర్ష‌ణ మాట్లాడుతూ.. ఇప్పుడొచ్చే సినిమాలకు భిన్నంగా ఉన్న  "నా వెంటే ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా " సినిమాను అందరూ ఆదరించాలి అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ.. ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇందులో ఉన్న ఐదు పాటలు కూడా ఐదు వేరేషన్ లో చాలా డిఫరెంట్ ఉంటాయి.ఈ పాటలన్నీ నాకు మంచి పేరు తీసుకువస్తాయి అన్నారు
 ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకులు సాగర్, వేణుగోపాల్ చారి లతో పాటు పాల్గొన్న వారందరూ ఆగష్టు 19 న విడుదల అవుతున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments