కళావతి పాట ఉచ్చారణలో దోషాలు లేవు- వినేవారిలోనే దోషం వుంది- అనంత శ్రీ‌రామ్‌

Webdunia
సోమవారం, 2 మే 2022 (11:39 IST)
Anantha Shriram
మ‌హేష్‌బాబు న‌టించిన  సర్కారు వారి పాట చిత్రంలో క‌ళావ‌తి పాట ఎంత హిట్ అయిందో తెలిసిందే. సిద్ద్ శ్రీ‌రామ్ పాడిన ఈపాట‌లో ఉచ్చార‌ణ దోషాలు మ‌న‌కు వినిపిస్తాయి. కానీ గీత ర‌చ‌యిత అనంత శ్రీ‌రామ్ అందుకు అంగీక‌రించ‌డంలేదు.
 
కొంతమంది గాయకులు సాహిత్యాన్ని తప్పుగా ఉచ్చరిస్తున్నారు. గేయ రచయిత చెప్పేవరకూ ఆ సాహిత్యం అర్ధం కావడం లేదు ? ఎవరి గురించి చెబుతున్నామో ఈ పాటకి మీకు తెలిసేవుంటుంది ?
 
 మీరు సిద్ శ్రీరామ్ గురించి మాట్లాడుతున్నారని నాకు అర్ధమైయింది. కళావతి పాట విషయానికి వస్తే అతని ఉచ్చారణ దోషాలు ఏమీ లేవు. నేను దగ్గర వుండి పాడించాను. ఐతే అతని గత పాటల్లో తెలుగు పరిచయం లేకపోవడంతొ కొన్ని తప్పులు జరిగుండోచ్చు. అదే మూడ్ లో వినేసరికి ఏదో తప్పుగా ఉచ్చరిస్తున్నారనే భావనే తప్పా.. కళావతి పాట ఉచ్చారణలో ఎలాంటి దోషాలు లేవు. దినితో పాటు  ఐతే పాట మిక్స్ చేసినపుడు కొన్ని ఎఫెక్ట్స్ వేస్తారు. దాని కారణంగా కూడా కొన్ని పదాలు వేరేగా వినిపించవచ్చు. పెరిగిన టెక్నాలజీకి మన చెవులు ఇంకా సిద్ధపడలేదని నా అభిప్రాయం.
 
ఒక పాటని ఈ విధంగా వినాలని ప్రేక్షకుడికి చెప్పలేం కదా ?
చెప్పాలి. ఒక బుల్లెట్ పేలిస్తే కనిపించదు. కానీ సినిమాలో దాన్ని  స్లో మోషన్ లో చూపిస్తే అది అసహజమే అయినప్పటికీ చూస్తున్నాం కదా. ప్రతిదాంట్లో టెక్నాలజీ వస్తుంది. దీనికి కళ్ళు ఎలా సిద్ధపడుతున్నాయో చెవులు కూడా అలా సిద్ధపడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆయన అద్భుతంరా బుజ్జీ: డిప్యూటీ సీఎం పవన్ దాతృత్వంపై ప్రశంసలు

మోడీజీ.. ప్లీజ్ నాకు న్యాయం చేయండి: అండర్ వరల్డ్ డాన్ కుమార్తె హసీన్ వీడియో ద్వారా విజ్ఞప్తి

Fibernet Case: చంద్రబాబుపై దాఖలైన ఫైబర్‌నెట్ కేసు.. కొట్టివేసిన వైజాగ్ ఏసీబీ కోర్టు

సార్, ఇక్కడ పవర్ కట్, నెట్ లేదు: WFH ఉద్యోగి నాటకాలు, పీకేయండంటూ కామెంట్స్

పార్లమెంటులో అమరావతి రాజధాని బిల్లుకు బ్రేక్.. సంబరాలు చేసుకుంటున్న వైకాపా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments