Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను ప్రేమ వివాహాన్ని న‌మ్ముతా - రుక్సార్ ధిల్లాన్

Advertiesment
Rukshar Dhillon
, శనివారం, 30 ఏప్రియల్ 2022 (14:26 IST)
Rukshar Dhillon
'అశోక వనంలో అర్జున కళ్యాణం' మే 6న థియేటర్లలోకి రానుంది. బాపినీడు, సుధీర్ ఈదర నిర్మాతలు, విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు. నటి రుక్సార్ ధిల్లాన్ సినిమా గురించి, అందులో తన పాత్ర, నిజ జీవితంలో ఆమె ఎలాంటి వ్యక్తి అనే విష‌యాలు ఇంటర్వ్యూలో తెలియ‌జేసింది.
 
- నా యాక్టింగ్ కెరీర్‌ని నేనెప్పుడూ ప్లాన్ చేసుకోలేదు. మొదట్లో  నేను చాలా అదృష్టవంతురాలినే. నా మొదటి సినిమా కన్నడలో పెద్ద బ్యానర్‌లో చేశా. తెలుగులో నాని, అల్లు శిరీష్‌లతో తొలినాళ్లలోనే పని చేశాను.
 
స‌- అశోక వనంలో..'లో నా పాత్ర ఇంతకు ముందు చేసిన దానికి అన్ని విధాలా భిన్నంగా ఉంటుంది. . సినిమాలో నా పాత్ర సాదాసీదా, పట్టణ యువతి పాత్ర. కుటుంబ వాతావరణంలో నివసిస్తుంది. ఆమెకు నైతిక విలువలు ఉన్నాయి. ఆమె మౌనంగా చాలా భావోద్వేగాలను ఎదుర్కొంటుంది. నటిగా  నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. ఇంతకు ముందు నేను చేసిన పాత్రకు భిన్నం ఈ పాత్ర.
 
- విశ్వక్ సేన్‌తో కలిసి పని చేయడం చాలా సరదాగా ఉండేది. తన పాత్రలో ఇమిడిపోయేవాడు. మా ఇద్ద‌రి న‌ట‌న బాగుంటుంది.  దర్శకుడి క్లియర్ కట్ విజన్ ఉపయోగపడింది.  
 
- . 'కృష్ణార్జున యుద్ధం' తెలుగులో నా తొలిచిత్రం కావడంతో అప్పట్లో నేను చాలా నెర్వస్‌గా ఉన్నాను. నాని, కో-స్టార్‌గా అర్థం చేసుకోవడంతో పని చేయడం చాలా సౌకర్యంగా ఉంది. త‌ను చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటాడు  నటనపై  దృష్టి పెడతాడు. అల్లు శిరీష్ కూల్‌గా ఉన్నాడు. మెగా కుటుంబం నుండి వచ్చినందున ఫిల్మ్ మేకింగ్ గురించి చాలా అవగాహన కలిగి ఉన్నాడు. విశ్వక్ ఎనర్జిటిక్ హీరో. ముగ్గురూ అంకితభావంతో ఉన్నారు. విశ్వ‌క్‌తో పని చేయడం చాలా సులభం
 
- కొన్నేళ్లుగా, నేను తెరపై  పెద్ద‌గా క‌నిపించ‌లేదు.  'అశోక వనంలో..' చేయడం వల్ల డైలాగులు నోరు మెదపకుండా ఎమోటింగ్ పవర్ ఏంటో నాకు అర్థమైంది. ప్ర‌స్తుతం రకరకాల ఆఫర్లు వస్తున్న తరుణంలో నేను హ్యాపీ స్పేస్‌లో ఉన్నాను.
 
- మా కుటుంబంలో ప్రేమ వివాహాలు జరిగాయి. కాబట్టి, నేను ప్రేమ వివాహాన్ని నమ్ముతాను. అరేంజ్డ్ మ్యారేజ్ వ‌ల్ల చుట్టాలంతా క‌లిసి మాట్లాడుకోవ‌డం ఒక థ్రిల్‌గా వుంటుంది.  రెండు కుటుంబాలు కలుసుకోవడానికి మరియు ఆలోచనలు పంచుకోవడానికి అవకాశం ఉంది. నాకు కాబోయేవాడు లుక్స్‌కి ఎక్కువ ప్రాధాన్య‌త‌ ఇవ్వను.   గౌరవప్రదంగా, మంచిగా,   డౌన్ టు ఎర్త్ ఉండేలా చూసుకుంటాను.
 
- న‌టిగా అవకాశం వస్తే సుకుమార్ దర్శకత్వంలో ఓ మంచి ప్రేమకథలో నటించాలనుకుంటున్నాను. ఆయన సినిమాలంటే నాకు ఎప్పుడూ ఇష్టం. నాకు అల్లు అర్జున్, మహేష్ బాబు   సరసన నటించడం ఇష్టం. నాకు 8 లేదా 10 సంవత్సరాల వయస్సులో, నేను విన్న హీరోలు వీరే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఏపీ మంత్రి ఆర్.కె.రోజా ఫ్యామిలీ