Webdunia - Bharat's app for daily news and videos

Install App

భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ కథతో దేశంకోసం

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (18:17 IST)
Ravindra, Jeeva
నాగలక్ష్మి ప్రొడక్షన్ పతాకం పైన రూపొందుతున్న 'దేశంకోసం' చిత్ర నిర్మాణం పూర్తయింది.  స్వాతంత్ర సమర పోరాటంలో అశువులు బాసిన .అమరవీరులు భగత్ సింగ్, చంద్రశేఖర్ల్ ఆజాద్ జీవిత విశేషాల ఆధారంగా ఈ చిత్రాన్ని మలిచారు. గతంలో 'నాగమ నాయకుడు' , రాఘవేంద్ర మహత్యం" వంటి పలు చిత్రాలను నిర్మించడంతో పాటు, ప్రధాన పాత్రలలో నటించిన రవీంద్ర ఈ తాజా చిత్రంలోనూ  ఓ ప్రధాన పాత్ర పోషిస్తూ, దర్శక, నిర్మాతగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇందులో చంద్రశేఖర్ ఆజాద్ గా  నూతన నటుడు రాఘవేంద్ర నటించగా, భగత్ సింగ్ గా రవీంద్ర నటించారు. చక్కటి దేశభక్తి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలన్న సదాశయంతో ఈ చిత్రాన్ని ఎంతో అభిరుచితో రూపొందించడం జరుగుతోందని నటుడు, దర్శక, నిర్మాత రవీంద్ర తెలిపారు. 
 
బుధవారం భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మొదటిసారి ఈ చిత్రం విశేషాలను తెలియజేస్తున్నట్లు రవీంద్ర వెల్లడించారు.  హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరిపామని, ఇటీవలే షూటింగ్ మొత్తం పూర్తయిందని, నిర్మాణానంతర పనులు త్వరలో  మొదలు కానున్నాయని ఆయన వివరించారు.. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో సుధ, జీవ, ప్రసాద్ బాబు, సూర్య, అశోక్ కుమార్, మనోహర్, వెంకటేశ్వరరావు, మెహర్, సుహరిన్ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి ప్రమోద్ శర్మ, సూర్యప్రకాష్, ఆనంద్, రామారావు, రామకృష్ణ, చంద్రమోహన్ సాంకేతిక నిపుణులు కాగా రచన, స్క్రీన్ ప్లే, నిర్మాణం, దర్శకత్వం: రవీంద్ర. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టేస్ట్ అట్లాస్‌లో భాగ్యనగరికి చోటు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments