Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండ‌స్ట్రి మీద ప్రేమ‌తోనే చేస్తున్నానంటున్న స్రవంతి

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (19:50 IST)
Anchor Sravanthi
స్ర‌వంతి చొక్క‌ర‌పు మంచి ఆక‌ర్షించే రూపు, క‌వ్వించే చూపు, చ‌క్క‌టి న‌వ్వుతో టెలివిజ‌న్ ప్రేక్ష‌కుల‌కి ఇటీవ‌ల సోష‌ల్ మీడియా ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచితురాలు. మాటివి ద్వారా త‌న యాంక‌రింగ్ ప్ర‌స్థానాన్ని మొద‌లుపెట్టిన స్ర‌వంతి త‌న టాలెంట్ తో వాక్‌చాతుర్యంతో స్టూడియో ఒన్‌ లో కొన్ని పోగ్రామ్స్ ని డీల్ చేసింది, అలానే జెమెని లో ప్ర‌తి రోజు 10 గంట‌ల‌కి లైవ్ లో ప్రేక్ష‌కుల‌తో మాట్లాడుతూ న‌వ్విస్తూ త‌న డ్ర‌స్సింగ్ స్ట్రైల్ తో అల‌రిస్తుంది. అంతేకాకుండా ప్ర‌ముఖ యూట్యూబ్ ఛాన‌ల్స్ లో సెల‌బ్రిటి ఇంట‌ర్యూస్ చేస్తూ రొజంతా బిజిగా వుండే ఈ యాంక‌రమ్మ ఇటీవ‌లే ట్రెండింగ్ లో వుంది. ఈటివి లాంటి ప్రైమ్ ఛానల్ లో మ‌ల్లెమ‌ల లాంటి నెంబ‌ర్ ఒన్ ప్రోడ‌క్ష‌న్ సంస్థ నిర్మాణం లో ప్ర‌ముఖ క‌మెడియ‌న్స్ చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెని లో క‌మెడియ‌న్ ఇమాన్యూల్ కి జోడి గా ఫేమ‌స్ అయ్యింది. 
 
అంతేకాదు స్ర‌వంతి టైమింగ్ కి ఈటివిలో గ‌తంలో కొన్ని ఆన్‌లైన్ షోస్ కూడా చేసింది. తాజాగా స్ర‌వంతి నెటిజ‌న్లని త‌న అంద‌మైన ఫోటోషూట్ తో ఆక‌ట్టుకుంటుంది. హ‌ట్ గా సృతిమించ‌కుండా యువ‌త‌ని ఆక‌ట్టుకునేలా త‌న ఇన్‌స్టాగ్రామ్ లో త‌న‌దైన శైలిలో ఫోటొస్ అప్‌లోడ్ చేసి సోష‌ల్ మీడియా సెన్సెష‌న్ అయ్యింది. అయితే త‌ను ఏం చేసినా కూడా తెలుగు సినిమా ఇండ‌స్ట్రి మీద ప్రేమ‌తోనే చేస్తున్నా.. నాకు గుర్తింపు రావ‌డానికి కార‌ణం తెలుగు సినిమా ప‌రిశ్ర‌మలోని పెద్ద‌లు అంటుంది. ఇంటర్యూల స‌మ‌యంతో హీరోలు, హీరోయిన్స్‌, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు మాకు ఇచ్చే గౌర‌వమే ఈ ప‌రిశ్ర‌మ మీద మాకు వున్న గౌర‌వం, అలాగే మాకు ఈ అవ‌కాశాలు క‌ల్పిస్తున్న పి ఆర్ ఒ లు కూడా చాలా మ‌ర్య‌ద‌గా గౌర‌వాన్నిస్తారు. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ లో నేను వున్న కాబ‌ట్టే నాకు ఈ గుర్తింపు, నాకే కాదు తెలుగు సిని కాళామ‌త‌ల్లిని న‌మ్ముకున్న‌వారంద‌రికి ఈ గుర్తింపు ఇస్తుంది. అందుకే తెలుగు సినిమా ఎప్ప‌టికి గొప్ప‌ది అని చెప్తుంది యాంక‌ర్ స్ర‌వంతి చొక్క‌ర‌పు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

టీటీడీ బోర్డు సభ్యులుగా నెల్లూరు నుంచి ఇద్దరు మహిళలు

శ్రీవారిని దర్శించుకున్న కొండా సురేఖ.. వైభవంగా దీపావళి ఆస్థానం (Video)

ఏలూరులో బైకుపై వెళ్తుండగా పేలిన దీపావళి ఉల్లిగడ్డ బాంబులు, ఒకరి మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

వరల్డ్ స్ట్రోక్ డే 2024: తెలంగాణలో పెరుగుతున్న స్ట్రోక్ సంఘటనలు, అత్యవసర అవసరాన్ని వెల్లడించిన హెచ్‌సిఏహెచ్

ఈ సమయాల్లో మంచినీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments