Webdunia - Bharat's app for daily news and videos

Install App

`ఆకాశవాణి` నుంచి 'దిమ్‌ సారె.` సాంగ్ విడుద‌ల‌

Webdunia
శనివారం, 10 జులై 2021 (13:36 IST)
Akasavani
విల‌క్ష‌ణ న‌టుడు సముద్ర‌ఖని‌, విన‌య్ వ‌ర్మ‌, తేజ కాకుమాను, ప్ర‌శాంత్ కీల‌క పాత్ర‌ధారులుగా ఏయు అండ్ ఐ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ప‌ద్మ‌నాభ‌రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'ఆకాశ‌వాణి'. రాజ‌మౌళి వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన అశ్విన్ గంగ‌రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి శుక్రవారం చిత్ర యూనిట్‌ 'దిమ్‌ సారె..' అనే లిరికల్‌ పాటను విడుదల చేసింది.  ఓ గూడెంలోని ప్రజలందరూ చాలా బాధగా ఉంటారు. అలాంటి సందర్భంలో అందరూ ఆనందంగా ఉండాలని, సంతోషంగా జాతర జరుపుకోవాలని అనుకునే సందర్భంలో ఈ పాటను చిత్రీకరించారు. అనంత్‌ శ్రీరామ్‌ రాసిన ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు.
 
ఇటీవల కాలంలో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు సంగీతాన్ని అందించి, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కాల‌భైర‌వ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హించారు. ప్రముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు అందించారు. సురేశ్ ర‌గుతు సినిమాటోగ్ర‌ఫర్‌గా వర్క్‌ చేశారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఈ చిత్రానికి ఎడిట‌ర్‌. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీగా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‌కు, 'మన కోన...' అనే పాటకు చాలా మంచి స్పందన వచ్చింది. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేస్తామని చిత్ర యూనిట్‌ సభ్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments