బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ షురూ

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (18:40 IST)
Bandla Ganesh
ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. ఇటీవలే సినిమా చిత్రీకరణ శనివారం ప్రారంభమైంది. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.
 
ఈ సందర్భంగా దర్శక - నిర్మాతలు మాట్లాడుతూ "తమిళ హిట్ 'ఒత్తు సెరుప్పు సైజ్ 7'కి‌ రీమేక్ ఇది. తమిళంలో ఆర్. పార్తిబన్ గారు పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ హీరో పాత్ర కోసం ఆయన పత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఆయన లుక్, యాక్టింగ్ అందరికీ సర్‌ప్రైజ్. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. నాన్‌స్టాప్‌గా సింగిల్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాం" అని చెప్పారు.
 
ఈ చిత్రానికి ఈ చిత్రానికి కళా దర్శకత్వం: గాంధీ, ఛాయాగ్రహణం: అరుణ్ దేవినేని, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: లైనస్ మధిరి, దర్శకత్వం: వెంకట్ చంద్ర, నిర్మాణం: స్వాతి చంద్ర.    'ఒత్తు సెరుప్పు సైజ్ 7'ను హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.‌ చెన్నైలో ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు ప్రమాదానికి నిర్లక్ష్యమే కారమణమా? సీఎం చంద్రబాబు హెచ్చరిక

ట్రావెల్ బస్సు యజమానులపై హత్యా కేసులు పెడతాం : టి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

ఒకే ఊరు.. ఒకే పాఠశాల .. మూడు వ్యవధి .. ముగ్గురు స్నేహితుల బలవన్మరణం... ఎందుకని?

కోవిడ్-19 mRNA వ్యాక్సిన్‌లు క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయట!

కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం: మృతుల కుటుంబానికి రూ.5లక్షలు ప్రకటించిన తెలంగాణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments