Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో కిరణ్ అబ్బవరం క సినిమా షూటింగ్ పూర్తి

డీవీ
మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (18:36 IST)
KA movie complted
హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్  సినిమా "క". ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌"క" సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ సినిమాను త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.  "క" సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు.
 
తాజాగా "క" సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎన్నో అందమైన లొకేషన్స్, భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్ తో ఈ సినిమాను అనుకున్న టైమ్ కు పూర్తి చేయగలిగారు మూవీ టీమ్. "క" సినిమా ఔట్ పుట్ పట్ల మేకర్స్ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సినిమా కంటెంట్ కు మంచి బజ్ ఏర్పడిన నేపథ్యంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు "క" సినిమా సిద్ధమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అరిఘాత్‌ నుండి కే-4 క్షిపణి ప్రయోగం విజయవంతం

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

కానిస్టేబుల్ కర్కశం... కన్నతల్లిని కొట్టి చంపేశాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments