Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జన సేన ద్వారా ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు సాయం ఆయ్ చిత్రం టీం విరాళం

Advertiesment
narne nitin, banny vas

డీవీ

, సోమవారం, 2 సెప్టెంబరు 2024 (18:15 IST)
narne nitin, banny vas
నార్నే నితిన్ హీరోగా వచ్చిన ఆయ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ఆగస్టు 15న విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది
 
గోదావరి ప్రాంత నేపథ్యంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఆడియెన్స్, విమర్శకుల నుండి ప్రశంసలతో పాటు, మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తండేల్ టీమ్ ఆయ్ యూనిట్‌ను అభినందించారు.
 
ఈ చిత్రం ఇప్పటికీ మంచి ఆక్యుపెన్సీ, డీసెంట్ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈరోజు నుండి వారాంతానికి వచ్చే ఆయ్ కలెక్షన్లలో నిర్మాత వాటాలో 25% జనసేన పార్టీ ద్వారా వరద బాధితులకు అందజేస్తామని నిర్మాత బన్నీ వాస్,  గీతా ఆర్ట్స్ ప్రకటించారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ ప్రాంతమంతా అల్లకల్లోలం అయిన సంగతి తెలిసిందే. వరదల వల్ల ఎంతో మందికి నీడ లేకుండాపోయింది. ఎంతో మందికి ఆహారం అందకుండా పోతోంది. వరద బాధితులకు అండగా నిలిచేందుకు నిర్మాత బన్నీ వాస్ ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో వరదల వల్ల నష్టపోయిన వారికి సాయంగా ఆయ్ టీం నిలిచింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి ఉండే సామాజిక బాధ్యత నుంచి స్పూర్తి పొంది బన్నీ వాస్ అండ్ టీమ్ వరద బాధితులకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త ప్రారంభానికి రష్మి గౌతమ్ రెడీ అవుతోంది, ఏమిటంటే...