Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌తి మ‌హిళ అలా చేస్తేనే నిజ‌మైన స‌క్సెస్ అయిన‌ట్లుః సాయిప‌ల్ల‌వి కామెంట్‌

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (20:28 IST)
Sai Pallavi
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా `లవ్ స్టోరి`. విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతున్న సంద‌ర్భంగా సాయిప‌ల్ల‌వి త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను ఆవిష్క‌రించింది. 
 
సాయి పల్లవి మాట్లాడుతూ,  నాగార్జున గారు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వస్తారు. ఆయన గురించి అప్పుడు చెప్పాలని అనుకున్నాను. మా తాతయ్య అన్నమయ్య సినిమా ఒక వందసార్లు చూసి ఉంటారు. ఆయనతో పాటు మేమూ చూశాం. ఆ సినిమా చూసినప్పటి నుంచి మీరంటే ఇష్టం, అభిమానం ఏర్పడ్డాయి. అన్నమయ్య సినిమా చూసి తాతయ్య ఏడుస్తుంటే, ఆయన నటిస్తున్నారు తాతయ్య ఏడవకు అన్నాను. కానీ తాతయ్య అన్నారు ఇప్పుడు నటిస్తుండొచ్చు , గానీ గత జన్మలో నాగార్జున యోగి అయి ఉంటారు అన్నారు. అప్పటి నుంచి మీ సినిమాలు టీవీలో వస్తే ఛానెల్ మారుస్తాను. ఎందుకంటే తాతయ్య దృష్టిలో మీరు ఎప్పుడూ అన్నమయ్యే. ఇవాళ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు థాంక్స్. 
 
దర్శకుడు శేఖర్ గారు చెప్పినట్లు నైతికంగా మనమంతా కరెక్ట్ గా ఉండాలని టీమ్ మొత్తం పాటించాం. అమ్మాయి తరుపున నిలబడి శేఖర్ గారు ఫైట్ చేశారు. ఈ సినిమా ద్వారా. సినిమా మేకింగ్ లోనూ ఆయన మా కోసమే మాట్లాడేవారు. ఈ సినిమాలో జరిగినట్లు నాకు అయింది అని చెప్పేందుకు అమ్మాయిలకి ఒక ధైర్యాన్ని లవ్ స్టోరి ఇచ్చింది. మ‌హిళలు ఎవ‌రైనా ఇలాంటి స‌మ‌స్య ఎదుర్కొంటే,  సాయిప‌ల్ల‌వి పాత్ర చూశాక బ‌య‌ట ప‌డండి. అమ్మా నాకూ ఇలా జ‌రిగింద‌ని చెప్పి జీవితాన్ని స‌రిచేసుకోండి. అప్పుడే నిజ‌మైన స‌క్సెస్‌. ప్ర‌తి అమ్మాయి త‌ప్ప‌నిస‌రిగా  సినిమా చూడాలి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments