Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ బర్త్ డే సందర్భంగా "రాజాసాబ్" నుంచి మోస్ట్ అవేటెడ్ అప్డేట్

ఠాగూర్
సోమవారం, 21 అక్టోబరు 2024 (18:58 IST)
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ "రాజాసాబ్" నుంచి రెబల్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అప్డేట్ ఇస్తున్నట్లు మేకర్స్ ఈరోజు అనౌన్స్ చేశారు. "రాజాసాబ్" సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానరులో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్‌లో "రాజాసాబ్" సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడింది. 
 
"రాజాసాబ్" అప్డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టరులో ప్రభాస్ అల్ట్రా స్టైలిష్‌గా కనిపించనున్నారు. "రాజాసాబ్" సినిమాలో ప్రభాస్ లుక్, మేకోవర్ చాలా కొత్తగా ఉండబోతోంది. సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్న ప్రెస్టీజియస్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ "రాజాసాబ్" సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్‌గా ప్రొడ్యూస్ చేస్తోంది. "రాజాసాబ్" సినిమా తమ సంస్థలో ఒక బెంచ్ మార్క్ మూవీగా మిగిలిపోయేలా నిర్మిస్తోంది.
 
"రాజాసాబ్" పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో వచ్చే ఏడాది ఏప్రిల్ 10న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం "రాజాసాబ్" చిత్రీకరణ తుది దశలో ఉంది. 
 
నటీనటులు - ప్రభాస్, నిధి అగర్వాల్,మాళవిక మోహనన్ తదితరులు
 
టెక్నికల్ టీమ్
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ - కార్తీక్ పళని
మ్యూజిక్ - తమన్
ఫైట్ మాస్టర్ - రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్
వీఎఎఫ్ఎక్స్ - ఆర్.సి. కమల్ కన్నన్
ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ - ఎస్ కేఎన్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా(సురేష్- శ్రీనివాస్), వంశీ కాకా
కో ప్రొడ్యూసర్ - వివేక్ కూచిభొట్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్ 
ప్రొడ్యూసర్ - టీజీ విశ్వప్రసాద్
రచన, దర్శకత్వం - మారుతి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments