Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు ఇంట దొంగ పడ్డాడు.. గోడ దూకాడు.. తీవ్రంగా గాయాలు

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2022 (09:40 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఇంట దొంగ పడ్డాడు. మహేశ్ బాబు ఇంట్లో చోరీ కోసం గోడ దూకిన ఓ దొంగ తీవ్ర గాయాలతో కాపలాదారుల చేతికి చిక్కాడు. మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 81లో నివసిస్తున్న మహేశ్ బాబు ఇంటికి కన్నం వేయాలని భావించిన ఓ దొంగ మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో ప్రహరీ దూకి లోపలికి ప్రవేశించాలని అనుకున్నాడు. 
 
అనుకున్నట్టే  గోడ ఎక్కి కిందికి దూకాడు. అయితే, అది చాలా ఎత్తుగా ఉండడంతో కిందపడిన దొంగ తీవ్రంగా గాయపడ్డాడు. పెద్ద శబ్ధం రావడంతో కాపలాకాస్తున్న సెక్యూరిటీ గార్డులు అక్కడికి వెళ్లి చూశారు. అక్కడ ఓ వ్యక్తి గాయాలతో పడి ఉండడంతో పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.
 
అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. అతడి పేరు కృష్ణ (30) అని, మూడు రోజుల క్రితం ఒడిశా నుంచి వచ్చి ఓ నర్సరీ వద్ద ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. 30 అడుగుల ఎత్తైన గోడ పైనుంచి దూకడంతో తీవ్రంగా గాయపడిన అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments