Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తల్లి మరణం.. ప్రిన్స్ ఎమోషనల్ పోస్ట్.. భర్త ప్రేమించినా అంగీకరించింది..

Advertiesment
Mahesh Babu
, గురువారం, 29 సెప్టెంబరు 2022 (08:53 IST)
Mahesh Babu
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కుటుంబం తల్లి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయింది. జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో ఇందిరా దేవి అంత్యక్రియలు పూర్తిచేశారు కుటుంబసభ్యులు. తల్లి అంత్యక్రియలు పూర్తైన తర్వాత సోషల్ మీడియాలో ఇందిరా దేవి ఫోటోను షేర్ చేస్తూ నలుపు రంగు హార్ట్ ఎమోజీలు పోస్ట్ చేశారు మహేష్. ఈ పోస్ట్‌పై అభిమానులు స్పందిస్తూ.. స్టే స్ట్రాంగ్ అన్నా.. మీతో మేము ఉన్నాం… బాధపడకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
 
మహేష్ బాబుకు తల్లి ఇందిరా దేవి అంటే అమితమైన ప్రేమ. సినీ ప్రమోషన్లలో తన తల్లి గురించి గొప్పగా చెబుతూ ఎమోషనల్ అయ్యేవారు. ఇందిరా దేవి సూపర్ స్టార్ కృష్ణ సతీమణి అయినా.. సినీ పరిశ్రమకు దూరంగా ఉండేవారు. భర్త, కొడుకులిద్దరు స్టార్ హీరోస్ అయిన.. వారి ప్రమోషనల్లో పాల్గోనేందుకు ఆసక్తి చూపించేవారు కాదు.
 
కేవలం కుటుంబసభ్యుల ఫంక్షన్లలో మాత్రమే ఇందిరా దేవి కనిపించేవారు. పెళ్లి వరకు మహేష్ ఎక్కువగా తన తల్లితోనే గడిపారు. ఆమెతో మహేష్‏కు అనుబంధం ఎక్కువగానే ఉంది.
 
సూపర్ స్టార్ కృష్ణకు ఇందిరా దేవి మామ కూతురు. కుటుంబసభ్యుల నిర్ణయంతో మరదలు అయిన ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం. పద్మ, మంజుల, ఇందిరా ప్రియదర్శిని, రమేష్ బాబు, మహేష్ బాబు.
 
ఇందిరా దేవితో వివాహం జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత కృష్ణ దివంగత నటి విజయ్ నిర్మలతో ప్రేమలో పడ్డారు. ఇదే విషయాన్ని ఇందిరా దేవితో చెప్పగా.. రెండవ వివాహనికి అంగీకరించింది. కృష్ణ రెండవ వివాహం తర్వాత ఇందిరా దేవి ఎక్కువగా బయట కనిపించలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుష్ప-1లో సమంత.. పుష్ప-2లో కాజల్ అగర్వాల్.. ఐటమ్ సాంగ్ చేస్తుందా?