Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారువారి పాట బ్లాస్ట‌ర్ విడుదలైన గంటల్లోనే సరికొత్త రికార్డ్

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (16:29 IST)
Mahesh-keerty
సూపర్‌స్టార్ మ‌హేశ్ లేటెస్ట్ మూవీ ‘సర్కారువారి పాట’. ప‌రశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రారంభం నుంచి భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేస్తోన్న ఈ చిత్రం నుంచి ఆగ‌స్ట్ 9న సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ పుట్టిన‌రోజు బ‌ర్త్ డే స్పెష‌ల్‌గా ‘సర్కారువారి పాట’ బ్లాస్ట‌ర్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ప్రేక్ష‌కాభిమానుల‌ను ఆక‌ట్టుకున్న ఈ బ్లాస్ట‌ర్‌తో సినిమాపై ఇప్ప‌టికే ఉన్న అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. విడుద‌లైన 24 గంటల్లోనే టాలీవుడ్‌లో ఎక్కువ‌గా వ్యూస్ ద‌క్కించుకున్న టీజ‌ర్‌గా ఓ సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. బ్లాస్ట‌ర్  24 గంట‌ల్లో.. 25.7 మిలియ‌న్స్ వ్యూస్‌, 7 ల‌క్ష‌ల 54 వేల లైక్స్‌ను సాధించింది.  
 
మ‌హేశ్ స్టైలిష్ లుక్‌, ఎన‌ర్జిటిక్ పెర్ఫామెన్స్‌, త‌న‌దైన ట్రేడ్ మార్క్ డైలాగ్ డెలివ‌రీతో పాటు సినిమాటోగ్ర‌ఫ‌ర్ మ‌ది కెమెరా వ‌ర్క్‌, యాక్ష‌న్ సీన్స్‌, బ్యూటీఫుల్ కీర్తిసురేవ్‌, నిర్మాణ విలువ‌లతో బ్లాస్ట‌ర్ ప్రేక్ష‌కాభిమానుల‌కు రియ‌ల్ ఫీస్ట్‌గా మారింది. 
 
సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా, పండ‌గ ఫెస్టివ‌ల్‌గా జ‌న‌వ‌రి 13న విడుద‌ల కాబోతున్న‌ట్లు బ్లాస్ట‌ర్‌లో క‌న్‌ఫ‌ర్మ్ అయ్యింది. ఉన్న భారీ అంచ‌నాల‌తో సూప‌ర్‌స్టార్ ఫ్యాన్స్ బ్లాస్ట‌ర్ రిలీజ్‌కే సినిమా రిలీజ్ అంతా హంగామాను క్రియేట్ చేశారు. ఇక సినిమా రిలీజ్ స‌మ‌యంలో ఫ్యాన్స్ ఎంత పెద్ద హంగామా చేస్తారో చూడాలి. ప‌ర్‌ఫెక్ట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్మెంట్‌, 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌వి శంక‌ర్‌, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్‌.మ‌ది సినిమాటోగ్రాఫ‌ర్‌, ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం, మార్తాండ్ కె.వెంక‌టేశ్ ఎడిట‌ర్‌, ఎ.ఎస్‌.ప్ర‌కాశ్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments