Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో "ది కేరళ స్టోరీ" చిత్ర ప్రదర్శన నిలిపివేత

Webdunia
ఆదివారం, 7 మే 2023 (17:23 IST)
వివాదాస్పద చిత్రం "ది కేరళ స్టోరీ" చిత్ర ప్రదర్శనకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ మూ ప్రదర్శనను సోమవారం నుంచి తమిళనాడు వ్యాప్తంగా నిలిపివేయనున్నారు. ముఖ్యంగా, మల్టీప్లెక్స్ థియేటర్లలో చిత్రాన్ని ప్రదర్శించబోమి మల్టీప్లెక్స్ థియేటర్స్ యజమానులు వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రత సమస్య తలెత్తకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు తెలిపారు. 
 
ఈ నెల 5వ తేదీ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం విడుదలకు ముందే వివాదాస్పదమైంది. అయినప్పటికీ చిత్రాన్ని యధావిధిగా శుక్రవారం రిలీజ్ చేశారు. అయితే, ఈ చిత్రాన్ని వీక్షించొద్దంటూ తమిళనాడులోని దర్శకుడు సీమాన్ సారథ్యంలోని నామ్ తమిళర్ కట్చి, ఎస్.డి.పి.ఐ వంటి కొన్ని పార్టీలు కూడా పిలుపునివ్వడమే కాకుండా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టాయి. 
 
దీనికితోడు ఈ చిత్రాని ప్రేక్షకుల ఆదరణ పెద్దగా లభించలేదు. దీంతో షోలను రీషెడ్యూల్ చేస్తున్నారు. ఇప్పటికే షెడ్యూల్ చేసిన పలు షోలను కూడా రద్దు చేశారు. మరోవైపు, ఈ చిత్ర ప్రదర్శనను కొనసాగిస్తే శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయని, అందుకే చిత్ర ప్రదర్శనను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్టు మల్టీప్లెక్స్ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది. 

సంబంధిత వార్తలు

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments