Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడుదలకు ముందే చరిత్ర సృష్టించనున్న "ఆదిపురుష్" ట్రైలర్

Webdunia
ఆదివారం, 7 మే 2023 (16:42 IST)
ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ "ఆదిపురుష్". ఈ చిత్రం ట్రైలర్ ఈ నెల 9వ తేదీన విడుదలకానుంది. ఆ రోజున భారత్‌తో పాటు 70 దేశాల్లో ఒకేసారి ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నారు. అలాగే, ఈ చిత్రాన్ని జూన్ 16వ తేదీన విడుదల చేయనున్నారు. 
 
ఇందులో రాముడుగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్‌లు నటించారు. త్రీడీ ఫార్మెట్‌లో పలు భాషల్లో తెరకెక్కించారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రభాస్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారభించి, వరుసగా కొత్తకొత్త పోస్టర్లను రిలీజ్ చేస్తుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన ఆదిపురుష్ ట్రైలర్‌ను భారత్, అమెరికా, కెనడా, సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మయన్మార్, శ్రీలంక, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికా, యూకే, రష్యా తదితర దేశాల్లో ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంస్థలు కలిసి నిర్మించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments