Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ది కాశ్మీర్ ఫైల్స్" చిత్ర దర్శకుడుకి వై కేటగిరీ భద్రత

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (15:48 IST)
కశ్మీర్ పండిట్ల ఊచకోత కథాంశంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రం "ది కశ్మీర్ ఫైల్స్". ఈ చిత్ర దర్శకుడు వివేక్ అగ్రిహోత్రికి బెదిరింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆయనకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రతను కల్పించింది. 
 
ఎలాంటి అంచనాలు లేకుండా ఇటీవల విడుదలైంది. కేవలం రూ.3 నుంచి రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించారు. కానీ, శుక్రవారానికి ఏకంగా రూ.100 కోట్ల మేరకు వసూలు చేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం. 
 
ఆ రోజుల్లో కశ్మీర్ పండిట్లు అనుభవించిన బాధలు, చూసిన నరకం, కశ్మీర్ పండిట్ల ఊచకోత తదితర అంశాలను దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమా చూసిన బయటకు వచ్చిన ప్రతి ఒక్కరి కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. 
 
అనేక వాస్తవ సంఘటనతో ఈ చిత్రాన్ని దర్శకుడు అగ్నిహోత్రి అద్భుతంగా తెరకెక్కించారని పలువురు అభినందలు తెలుపుతుంటే, మరికొందరు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. చంపుతామంటూ బెదిరిస్తున్నారు. 
 
దీంతో కేంద్ర ప్రభుత్వం ఆయనకు వై కేటగిరీ భద్రతను కల్పించింది. అంటే ఆయన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా సీఆర్పీఎఫ్ బలగాలు రక్షణగా ఉంటాయి. కాగా, బాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఈ తరహా భద్రతను నటి కంగనా రనౌత్‌కు ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్ ఉప ఎన్నికలు.. ఖాతా తెరవని ప్రశాంత్ కిషోర్ పార్టీ

ఇంజనీరింగ్ విద్యార్థికి ఆ కాల్.. షాకైయ్యాడు.. తర్వాత ఏం జరిగిందేంటంటే?

వైసిపికి మరో షాక్, ఎమ్మెల్సీ వెంకటరమణ రాజీనామా

వాయనాడ్‌‌లో ప్రియాంక గాంధీ ఘనవిజయం.. రాహుల్ రికార్డ్ బ్రేక్

'మహాయుతి' అదుర్స్.. మోదీ, అమిత్ షా, చంద్రబాబు అభినందనలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments