Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ‌రాముడి అవ‌తారం మారిపోతోంది- ప్ర‌భాస్ మెప్పిస్తాడా!

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (13:53 IST)
Aadi purush getup (Fc)
సినిమాల‌లో శ్రీ‌రాముడి అవ‌తారం ర‌క‌ర‌కాలుగా మారుతోంది. తెలుగువారి లోగిళ్ళ‌లో శ్రీ‌రాముడు ఇలా వుంటాడ‌నేది గ‌తంకాలంనుంచి వ‌స్తున్న ఆర్టిస్టులు వేసిన గెట‌ప్ ఆధారంగానే తీర్చిదిద్ద‌బ‌డింది. దేవ‌స్థానంలోనూ ప్ర‌తిమ రూపంలో ఇలా వుంటాడ‌ని అంచ‌నా వుండేది. ఇక ఆ అవ‌తార పురుషుడి వేష‌ధార‌ణ వేయాలంటే నాట‌కాల‌నుంచి ప‌లువురు ప‌లుర‌కాలుగా క‌నిపించారు. సినిమాల‌లోకూ ప‌లువురు శ్రీ‌రాముడు పాత్ర‌ను పోషించి మెప్పించారు.
 
బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలోనే శ్రీ‌రాముడు పాత్ర‌ను మొద‌ట‌గా ఎడ‌బ‌ల్లి సూర్య‌నారాయ‌ణ చేశారు. ఆ త‌ర్వాత సి.ఎస్‌.ఆర్‌. పోషించారు. అనంత‌రం `వీరాంజ‌నేయ‌`లో కాంతారావు పోషించారు. `సీతారామ క‌ళ్యాణం`లో ర‌వి పోషించాడు. ఎ.ఎన్‌.ఆర్‌. కూడా న‌టించాడు. ఎన్‌.టి.ఆర్‌. న‌టించిన పాత్ర‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. త‌ను రాముడు, కృష్ణుడు వేసినా ఇలానే వుంటాడేమోన‌ని ప్రేక్ష‌కుల‌కు అనిపించేలా వుండేది ఆహార్యం. అనంత‌రం `శ్రీ‌రామ‌దాసు`లో సుమ‌న్‌కూడా మురిపించాడు.
 
పురాణాల్లో శ్రీ‌రాముడు ఆజానుబాహుడు, అర‌వింద ద‌ళాక్షుడు అనే పేరుంది. అన్ని ఫీచ‌ర్స్ గ‌తంలో పోషించిన న‌టుల‌లో లేక‌పోయినా అప్ప‌టి ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మెప్పించారు. కానీ ఇప్పుడు ఆ పాత్ర‌ను `ఆది పురుష్‌`లో ప్ర‌భాస్ లో చూపించ‌బోతున్నార‌ట‌. మ‌న రాముడు ఇలా వుంటాడ‌ని అనుకుంటాం. కానీ భార‌త దేశంలో శ్రీ‌రాముడు ఆయా న‌టుల‌కు అనుగునంగా వుంటారు. ఇప్పుడు ప్ర‌భాస్ చేయ‌బోయే పాత్ర తీరు కూడా అలానే వుంటుంది. శ్రీ‌రాముడు కండ‌లు క‌లిగి శ‌రీర‌సౌష్ట‌వం వున్న గెట‌ప్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల‌చేసింది. వెండితెర రాముడు ప్ర‌భాస్ లుక్‌లో వైవిధ్యంగా వుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఇండియ‌న్ తెర‌పై చేయ‌ని విజువ‌ల్ ఎఫెక్ట్ తో ఆ పాత్ర‌ను మ‌లుస్తున్నార‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాతో శ్రీ‌రాముడుగా ప్ర‌భాస్ మెప్పిస్తాడా? లేదా? చూడాల్సిందేనంటూ విశ్లేషిస్తున్నారు సినీ ప్రియులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments