Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ చిత్రంలోని ఆ ఒక్క పాటకే 15 కోట్ల వ్యూస్... మరి బాహుబలి సంగతేంటి? (Video)

ఇపుడు కొత్త చిత్రాల ప్రచారం ఎక్కువగా సోషల్ మీడియా లేదా యూట్యూబ్ ద్వారానే జరుగుతోంది. చిత్రం ఫస్ట్ లుక్ వెల్లడైనప్పటికీ.. చిత్రం విడుదలయ్యేంతకు ప్రతి ఒక్కరూ యూట్యూబ్‌ వ్యూస్‌నే ప్రమాణికంగా తీసుకుంటున్న

Webdunia
శనివారం, 18 మార్చి 2017 (15:51 IST)
ఇపుడు కొత్త చిత్రాల ప్రచారం ఎక్కువగా సోషల్ మీడియా లేదా యూట్యూబ్ ద్వారానే జరుగుతోంది. చిత్రం ఫస్ట్ లుక్ వెల్లడైనప్పటికీ.. చిత్రం విడుదలయ్యేంతకు ప్రతి ఒక్కరూ యూట్యూబ్‌ వ్యూస్‌నే ప్రమాణికంగా తీసుకుంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో... 'ఓకే జాను' సినిమాలోని 'హమ్మ హమ్మ' పాట‌ యూట్యూబ్‌లో దుమ్ము దులిపేస్తోంది. బాక్సాఫీసు వద్ద సినిమాకు వ‌చ్చిన ఆద‌ర‌ణ‌తో ఏ మాత్రం సంబంధం లేకుండా దూసుకుపోతోంది. సినిమా ప్ర‌చారంలో భాగంగా ఆ చిత్ర బృందం మూడు నెలలకు ముందు ఈ రిమిక్స్ పాట‌ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. 
 
ఇప్పటివరకు ఈ పాట యూట్యూబ్‌లో 15,34,53,080 వ్యూస్‌ను సాధించింది. అలాగే, 6,48,854 మంది ఈ సాంగ్‌‍ను లైక్ చేయగా, 63,653 మంది డిజ్‌లైక్ చేశారు. ఈ సంద‌ర్భంగా సోని మ్యూజిక్ ఇండియా సంస్థ తమ ట్విట్ట‌ర్ ఖాతాలో హ‌ర్షం వ్య‌క్తం చేసింది. దిగ్గ‌జ‌ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహమాన్ అందించిన హమ్మ హమ్మ పాటను ఓకే జాను సినిమా కోసం రిమిక్స్ చేశారు.
 
ఈ పాట‌లో శ్ర‌ద్ధాకపూర్ అందాలకు రెహ‌మాన్ మ్యూజిక్ తోడ‌వడంతో ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న వచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు యూట్యూబ్‌లో బేఫికర్ చిత్రంలోని ‘నషే సి చద్’ 20 కోట్ల 11 ల‌క్ష‌ల‌ వ్యూస్‌తో తొలిస్థానంలో ఉంది. ఈ వీడియో సాంగ్‌ను గ‌త ఏడాది అక్టోబ‌ర్ 18న ఉంచారు. ఆ త‌ర్వాత‌ బార్ బార్ దేఖో సినిమాలోని 'కాలా చెష్మా' 20 కోట్ల 2 లక్షల వ్యూస్‌తో రెండో స్థానంలో ఉంది. ఆ త‌ర్వాతి స్థానంలో హమ్మ హమ్మ సాంగ్ నిలిచింది.
 
ఇదిలావుండగా, ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. అయితే, చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ విడుదలైన కేవలం కొన్ని గంటల్లోనే ఐదు కోట్ల వ్యూస్‌ను సాధించింది. ఇది భారతీయ చలన చిత్రరంగంలో ఓ రికార్డుగా చెప్పుకుంటున్నారు. బాహుబలి ట్రైలర్ ఈ రేంజ్‌లో వ్యూస్‌ను కొల్లగొట్టేస్తుంటే.. ఇక ఆ చిత్రంలోని పాటలు ఏ విధంగా వ్యూస్‌ను సొంతం చేసుకుంటాయన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments