Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఉయ్యలవాడ నర్సింహా రెడ్డి' ఫస్ట్‌లుక్‌ ఇదే.. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం

మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రంగా ఉయ్యలవాడ నరసింహా రెడ్డిలో నటించనున్నారు. దాదాపు దశాబ్దకాలం తర్వాత వెండితెరపై 'ఖైదీ నంబర్ 150'తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి... ఈ చిత్రంతో మరోమారు తన సత్తా చాటాడు.

Webdunia
శనివారం, 18 మార్చి 2017 (14:43 IST)
మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రంగా ఉయ్యలవాడ నరసింహా రెడ్డిలో నటించనున్నారు. దాదాపు దశాబ్దకాలం తర్వాత వెండితెరపై 'ఖైదీ నంబర్ 150'తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి... ఈ చిత్రంతో మరోమారు తన సత్తా చాటాడు. ఈ క్రమంలో తన 151వ చిత్రంగా 'ఉయ్యలవాడ నరసింహారెడ్డి' పేరుతో తెరకెక్కించే చిత్రంలో నటించనున్నారు. 
 
కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై చిరంజీవి తనయుడు, హీరో రాంచరణ్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. దేవీశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. రాయలసీమ చారిత్రక నేపథ్యమున్న ‘ఉయ్యలవాడ నర్సింహారెడ్డి’ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. 
 
అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 'ఉయ్యలవాడ నరసింహారెడ్డి' ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదేనంటూ విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో వైరల్ అవుతోంది. గొడ్డలి, టైటిల్‌ లోగోతో చాలా పవర్‌ఫుల్‌గా ఉంది ఆ పోస్టర్‌. అయితే ఆ పోస్టర్‌ ఎక్కడి నుంచి వచ్చిందనేది మాత్రం తెలియడం లేదు. అయితే, ఈ పోస్టర్ విషయంలో కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments