Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

దేవీ
మంగళవారం, 6 మే 2025 (12:07 IST)
Bhagyasree Bors
మంత్రముగ్ధులను చేసే కళ్ళు, అంతే మంత్రముగ్ధులను చేసే చిరునవ్వు కలిగిన భాగ్యశ్రీ బోర్సెకూ  రామ్ పోతినేని రిలేషన్ షిప్ లో వున్నారనే వార్తలు వచ్చాయి. దీనిపై భాగ్యశ్రీ సోషల్ మీడియాలో కూడా స్పందించింది. ఆమె చేతికి ఉంగరం ధరించివుండడం చూసిన నెటిజన్లు ప్రేమ వ్యవహారం గురించి అడిగితే, అది నేనే కొనుక్కున్నానని అని చెప్పింది. ఆ తర్వాత ఆమె రామ్ పోతినేని సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా నిర్మాణ సంస్థ మైత్రీమూవీస్ మేకర్స్ శుభాకాంక్షలు చెబుతూ న్యూ లుక్ విడుదల చేశారు.
 
Bhagyasree Bors, Ram
రామ్ నటించే 22వ సినిమాలో ఆమె నటిస్తోంది. ఇటీవలే కొంత షూట్ కూడా చేశారు. గత ఏడాది భాగ్యశ్రీ బోర్సే "మిస్టర్ బచ్చన్", "చందు ఛాంపియన్ చిత్రాల్లో నటించింది. తాజాగా విజయ్ దేవరకొండతో "కింగ్‌డమ్" సినిమాలో నటించింది. కింగ్ డమ్ లో మాత్రం లిప్ కిస్ లో లీనమై నటించిన వీడియో కూడా ఇటీవలే విడుదలైంది. అదేవిధంగా రామ్ తో నటించే సినిమాలో వీరి మధ్య కెమిస్ట్రీ హైలైట్ అవుతుందన చిత్రయూనిట్ తెలియజేస్తుంది. త్వరలో వీరిద్దరి పై ఓ సాంగ్ చిత్రీకరించనున్నారు.
 
ఇదిలా వుండగా, ఇప్పటికే సక్సెస్ లేని బోర్సె, సక్సెస్ కోసం ఆరాటపడుతున్న హీరోలతో కలిసి నటించడం విశేషం. రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ సినిమాల్లో విజయం సాధిస్తాననే నమ్మకాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా అభిమానులను ఉత్సాహపరిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్‌పై కేసు నమోదు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments