ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

ఠాగూర్
సోమవారం, 5 మే 2025 (23:41 IST)
తాను ఆరోగ్యంగా, కులాసానే ఉన్నానని, రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లినట్టు ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర అన్నారు. నటుడు ఉపేంద్ర అనారోగ్యానికి గురైనట్టు మీడియాలో వార్తలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఉపేంద్ర తన ఆరోగ్యంపై స్పందించారు. 
 
"నేను ఆరోగ్యంగానే ఉన్నా. రెగ్యులర్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లా. పుకార్లను నమ్మకండి" అని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ పోస్ట్ చేశారు. యూఐ సినిమా షూటింగ్‌ సమయంలోనే ఉపేంద్రకు అనారోగ్య సమస్యలు తలెత్తాయని, ఇపుడు ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారంటూ కన్నడ మీడియా కథనాలను ప్రసారం చేసింది. కాగా, ఆయన కడుపునొప్పి, డీహైడ్రేషన్ కారణంగానే ఆస్పత్రికి వెళ్లినట్టు తాజా సమాచారం. 
 
ఇకపోతే, ఉపేంద్ర సినిమాల విషయానికి వస్తే గత యేడాది యూఐతో ప్రేక్షకుల ముందుకు వచ్చిని ఆయన... ప్రస్తుతం పలు చిత్రాల్లో బిజీగా ఉన్నారు. శివరాజ్ కుమార్ నటిస్తున్న 45 మూవీ ఆగస్టు 15వ తేదీన విడుదలకానుంది. మరోవైపు, ఆయన కీలక పాత్ర పోషించిన "కూలీ" ఆగస్టు 14వ ప్రేక్షకుల ముందుకురానుంది. అందులో రజనీకాంత్ హీరో. లోకేశ్ కనకరాజ్ దర్శకుడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఇకపై కొనసాగలేను : డీకే శివకుమార్

పుట్టపర్తిలో ప్రధాని మోడి పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యా రాయ్ (video)

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments