Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ వివాహం తర్వాతే నా పెళ్లి.. విశాల్ కామెంట్స్

సెల్వి
శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (18:42 IST)
ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ప్రభాస్‌ని చెప్తుంటారు. ప్రస్తుతం ఆయన వివాహం నెట్టింట చర్చకు దారి తీసింది. తాజాగా ప్రభాస్ పెళ్లి అంశాన్ని తమ సినిమాల ప్రమోషన్ల కోసం ఉపయోగిస్తున్నారు.
 
ప్రస్తుతం విశాల్ తన తాజా సినిమా రత్నంతో తెరపైకి వచ్చాడు. సంచలన దర్శకుడు హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం థ్రిల్లింగ్, యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో బిజీ ప్రమోషన్ కార్యక్రమాల మధ్య విశాల్ పెళ్లి గురించి మాట్లాడాడు.
 
పెళ్లి గురించి అడిగినప్పుడు, సరైన సమయం వచ్చినప్పుడు పెళ్లి చేస్తానని విశాల్ పేర్కొన్నాడు. ప్రభాస్ పెళ్లికి తర్వాతే తన పెళ్లి వుంటుందని తెలిపాడు. ఆ ఆహ్వానం అందుకున్న మొదటి వ్యక్తి ప్రభాస్ కూడా కావచ్చు అని సరదాగా కామెంట్స్ చేశాడు.
 
 
 
ఆసక్తికరంగా, తమిళ నిర్మాతల కోసం నడిగర్ సంఘం భవనాన్ని నిర్మించడం వల్ల గతంలో తన వివాహ ప్రణాళికలు వాయిదా పడ్డాయని విశాల్ వెల్లడించాడు. విశాల్‌కి గతంలో ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగింది. అనుకోని కారణాలతో ఆ వివాహం ఆగిపోయింది. 
 
ఇక విశాల్ లేటెస్ట్ మూవీ రత్నం విషయానికి వస్తే... అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు హరి తెరకెక్కించాడు. విశాల్ కి జంటగా ప్రియా భవాని శంకర్ నటించింది. ఏప్రిల్ 26న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. విశాల్ గత చిత్రం మార్క్ ఆంటోని మంచి విజయం సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

Elephant: తిరుమల శ్రీవారి మెట్టు సమీపంలో ఏనుగుల గుంపు.. యాత్రికులు షాక్

Andhra Pradesh: దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు.. ఏఐ సాయంతో డ్రోన్స్.. ఏర్పాట్లు ముమ్మరం

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments