Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబి క్లాప్ తో `జ‌గ‌దానంద కార‌క` సినిమా ప్రారంభం

Webdunia
గురువారం, 1 జులై 2021 (17:00 IST)
Bobby-Vinit chandra-ani shinde
నూత‌న న‌టీన‌టుల‌ను తెర‌కు ప‌రిచ‌యం చేస్తూ చ‌క్రాస్ బ్యాన‌ర్ నిర్మిస్తున్న చిత్రం `జ‌గ‌దానంద కార‌క‌'. రామ్ భీమ‌న ద‌ర్శ‌కుడు. నిర్మాత వెంక‌ట‌ర‌త్నం. లైన్ ప్రొడ్యూసర్స్ గా మాదాసు వెంగ‌ళ‌రావు, స‌తీష్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వినీత్ చంద్ర‌ - అనిషిండే నాయ‌కా నాయిక‌లుగా ప‌రిచ‌యం అవుతున్నారు. 
గురువారం ఉదయం ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ప్రముఖ ద‌ర్శ‌క‌నిర్మాత‌  ద‌ర్శ‌క‌సంఘం మాజీ అధ్య‌క్షుడు వీర‌శంక‌ర్ స్క్రిప్టు ప్ర‌తులు అందించగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాబి క్లాప్ కొట్టారు.ఇతర న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల ఎంపిక జ‌ర‌గ‌నుంది. జూలై 15 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ చిత్రీక‌ర‌ణ సాగ‌నుంది. క‌డియం-రాజ‌మండ్రి ప‌రిస‌రాల‌లో తెర‌కెక్క‌నుంది.
 
దర్శ‌కుడు బాబి మాట్లాడుతూ-``టైటిల్ చాలా పాజిటివ్ గా ఉంది. ద‌ర్శ‌కుడు భీమ‌న‌ పెద్ద సక్సెస్ ఇవ్వాలి. ఈ సినిమా టైటిల్ లోగో నాకు బాగా నచ్చింది. నా సినిమా `జై ల‌వ‌కుశ` త‌ర‌హా పాజిటివిటీ క‌నిపించింది. అంత పెద్ద విజ‌యం అందుకోవాలి`` అని అన్నారు. 
 
దర్శకులు వీర‌శంక‌ర్ మాట్లాడుతూ-``నా ప్రియ‌మిత్రుడు రామ్ భీమ‌న మూడో సినిమా ఇది. ఈ సినిమాకి మంచి టైటిల్ పెట్టారు. ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు మంచి పేరు రావాలి. చ‌క్క‌ని విజ‌యం అందుకోవాలి``అన్నారు.
ద‌ర్శ‌కుడు రామ్ భీమ‌న‌ మాట్లాడుతూ- దర్శకుడిగా ఇది నా మూడో సినిమా. మీ అంద‌రినీ మెప్పించే గొప్ప సినిమా అవుతుంద‌ని ఆశిస్తున్నా. అంద‌రి ఆశీస్సులు కావాలి`` అన్నారు. 
'ఆక‌తాయి' సినిమా త‌ర్వాత అదే ద‌ర్శ‌కుడితో మ‌ళ్లీ సినిమా చేస్తున్నామ‌ని లైన్ ప్రొడ్యూసర్ స‌తీష్ కుమార్ అన్నారు. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ చిత్ర‌మ‌వుతుంది.. అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్‌ బుడమేరు: విజయవాడను వరద ముంపు నుంచి తప్పించే ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుంది, ఆక్రమణల మాటేంటి?

మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై ఎంపికపై వీడని ఉత్కంఠ - హస్తినకు ఆ ముగ్గురు నేతలు

మెట్టు దిగిన ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం

హిందూ - ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ కుట్ర : రాహుల్ గాంధీ

ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ.. పార్లమెంట్ సమావేశాల మధ్య...?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments