Webdunia - Bharat's app for daily news and videos

Install App

గనిలో యాక్షన్ సీన్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (17:03 IST)
Ghani team
వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు, ట్రైలర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. 
 
ఒక్క కట్ కూడా లేకుండా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గని ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఏప్రిల్ 2న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి ప్రమోషనల్ కార్యక్రమాలలో మరింత జోరు పెంచనున్నారు దర్శక నిర్మాతలు. విడుదల ముందు వరకు ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా వినూత్నమైన ప్రచారం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వందేభారత్ తొలి స్లీపర్ రైలు సిద్ధం... ప్రత్యేకత ఏంటి?

Uttarkashi: భారీ వర్షాలు- ఉత్తరకాశిలో ఒక గ్రామమే కొట్టుకుపోయింది.. నివాసితులు గల్లంతు (video)

సరోగసీ స్కామ్‌- పారిపోవాలనుకున్న నమ్రతను ఎయిర్ పోర్టులో పట్టేశారు..

ఆత్మహత్య చేసుకున్న పీజీ మెడికల్ విద్యార్థిని.. ఆ ఒత్తిడితోనే మరణించిందా? కారణం ఏంటో?

ఏపీలో న్యాయం, ధర్మం కనుమరుగైంది.. అమరావతి పేరుతో అవినీతి: జగన్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments