Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైగ‌ర్‌ కోసం డబ్బింగ్ పూర్తి చేసిన మైక్ టైసన్

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (16:49 IST)
Mike Tyson dubbing
పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండతో  భారీ అంచనాలతో  రూపొందిన‌ చిత్రం `లైగ‌ర్‌` (సాలా క్రాస్‌బ్రీడ్) షూటింగ్ పార్ట్ పూర్తయి  పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.  ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ  లైగర్ సినిమాతో ప్ర‌పంచ బాక్స‌ర్ మైక్ టైసన్ భారతీయ సినిమాలోకి అడుగుపెట్టాడు.
 
యుఎస్‌ఎలో విజయ్ దేవరకొండతో పాటు మైక్ టైసన్‌కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీక‌రించిన విష‌యం తెలిసిందే.  తాజాగా  మైక్ టైసన్ ఈ చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేశారు. “నా పట్ల దయ చూపినందుకు చాలా ధన్యవాదాలు. నేను చాలా కృతజ్ఞుడను, ”అని మైక్ టైసన్ ఒక వీడియోలో తెలిపారు.
 
మైక్ టైసన్ ఈ చిత్రంలో ఒక శక్తివంతమైన పాత్రను పోషించాడు. అత‌నిపై చిత్రించిన స‌న్నివేశాలు చిత్రంలో ప్రధాన హైలైట్‌లలో ఒకటిగా ఉంటాయి. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ కలిసి తెరపై చూడటం అభిమానులకు పండగే. పెద్ద స్క్రీన్‌లపై నిజమైన యాక్షన్‌ని చూసేందుకు సినీ ప్రియులు ఉత్కంఠ‌భ‌రితంగా ఎదురుచూస్తున్నారు.
 
పూరీ కనెక్ట్స్‌తో కలిసి, ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
 
థాయ్‌లాండ్‌కు చెందిన కేచా స్టంట్ డైరెక్టర్‌గా, విష్ణు శర్మ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.
 
హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
 
తారాగణం: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే,  గెటప్ శ్రీను.
 
సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా
బ్యానర్లు: పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్
DOP: విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ బాషా
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
స్టంట్ డైరెక్టర్: కేచ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments