Webdunia - Bharat's app for daily news and videos

Install App

థాంక్యూ సినిమా ట్విట్టర్ రివ్యూ ఎలా వుందంటే?

Webdunia
శుక్రవారం, 22 జులై 2022 (11:00 IST)
Thank you
థాంక్యూ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూలై 22న విడుదలైంది. లవ్ స్టోరీ తర్వాత హీరో నాగచైతన్య ప్రతిష్టాత్మకంగా తీసిన ఈ చిత్రానికి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించారు. విక్రమ్ కే. కుమార్ తన గత చిత్రాల మాదిరిగానే క్లాసిక్ టచ్‌తో నిర్మించారు. నాగచైతన్యతోపాటు రాశిఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్, సాయి సుశాంత్ రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రధారులు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 
ఈ చిత్రం ట్రైలర్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. చైతన్యపై ఉన్న నమ్మకంతో అభిమానులు ఉత్సాహంగా థియేటర్లలోకి వెళ్లారు. మరి ఈ సినిమా ఇప్పటికే ప్రీమియర్స్ పడిపోగా ఈ సినిమా రివ్యూ ఎలా వుందో ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు.  
 
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మన జీవితంలో మన ఎదుగుదలకు కారణమైన వ్యక్తులకు 'థాంక్యూ' చెప్పాలన్న నేపథ్యంలో తెరకెక్కింది. నారాయణపురం అనే చిన్న గ్రామానికి చెందిన అభిరామ్ నుంచి వెళ్లి బిలియనీర్ ఎలా అయ్యాడన్నది కథ.
Thank you


ఒక కంపెనీకి యజమాని ఎలా అయ్యాడు? అతడు ఎప్పుడూ తన సొంతంగా ఎవరి సహాయం లేకుండా ఎదిగాను అనుకుంటూ బతికేస్తాడు. ఒకరోజు తన ప్రయాణం వెనుక చాలా మంది వ్యక్తులు ఉన్నారని తెలుసుకొని వారికి థాంక్యూ చెప్పాలని నిర్ణయించుకుంటాడు. మరి తను తన కృతజ్ఞత భావాన్ని ఎలా చూపిస్తాడన్నది సినిమా కథ.   
 
విశ్లేషణ..
థాంక్యూ సినిమాకు రెండు హైలెట్ అని.. ఒకటి థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఇంకొకటి పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అద్భుతం అంటున్నారు. ఫస్లాఫ్ బాగుందని కొందరు.. సెకండ్ ఆఫ్ బోరింగ్ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
 
థ్యాంక్యూ మూవీ సింపుల్ అండ్ క్లీన్ ఫీల్ గుడ్ క్లాసిక్ మూవీ అని నెటిజన్లు అంటున్నారు. గుడ్ క్లైమాక్స్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అని చెప్తున్నారు. ఫస్టాప్ ఎక్సలెంట్ అని, సెకండ్ హాఫ్ గుడ్ అని చెప్తున్నారు. 
Thank you


చై ఈ సినిమా మొత్తాన్ని తన భుజాన్నేసుకుని నడిపాడని నెటిజన్లు అంటున్నారు. బీజీఎం, ఫోటోగ్రఫీ, మ్యూజిక్ అదిరిందని టాక్ వచ్చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన నేత పుట్టిన రోజు.. ఏలూరులో రేవ్ పార్టీ.. అశ్లీల నృత్యాలు (video)

రేణిగుంట: క్యాషియర్ మెడపై కత్తి పెట్టిన యువకుడు.. సంచిలో డబ్బు వేయమని? (video)

డిసెంబర్ 21-25 వరకు భవానీ దీక్ష.. భక్తుల కోసం భవానీ దీక్ష 2024 యాప్

ప్రేమకు హద్దులు లేవు.. వరంగల్ అబ్బాయి.. టర్కీ అమ్మాయికి డుం.. డుం.. డుం..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాయలసీమ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments