సంగీత దర్శకుడు థమన్ తన జీవితాలనుభవాలనుంచి నేర్చుకున్నవి ప్రజలకు తెలియజేశారు. జీవితంలో మనిషికి ఏదో టాలెంట్ వుంటుంది. ఆ దిశగా దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రస్తుతం మన విద్యావిధానం అస్సలు బాగోలేదు. అంది ఎందుకూ పనికిరాదు. నేను చదివింది తక్కువే అయినా సమాజాన్ని చదివానని నొక్కి చెప్పారు. అందుకే ఇద్దరు వ్యక్తల పేర్లు చెప్పాడు. అదే ఈ ఫొటో.. ఫొటోలో త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్‌తో థమన్ వున్నాడు. ఇలా వారితో వుండడానికి కారణం నేను చదువుకున్న చదువుకాదని తేల్చిచెప్పారు.
సాయి శ్రీనివాస్ తమన్ (ఎస్.ఎస్.థమన్) అలీతో సరదాగా అనే కార్యక్రమంలో పలు విషయాలను వెల్లడించారు. తన తండ్రి చిన్నతనంలో చనిపోయాడు. తన నాన్న డ్రమ్మర్. అదే నాకు అలవాటయింది. కానీ చదువు అబ్బలేదు. ఆరు సబ్జెక్ట్‌లుంటే అందులో ఒకటి మాత్రమే నాకు ఇంట్రెస్ట్‌గా వుండేది. దానిలో 100కు 100 మార్కులు వచ్చేవి. మిగిలిన సబ్జెక్ట్‌లు అర్థమయ్యేవికావు. నేను స్కూల్లో వుండగానే కల్చర్ ప్రోగ్రామ్‌లో పాల్గొనేవాడిని. డ్రమ్ము వాయించేవాడిని. పాటలు పాడేవాడిని. దానితో నాకు మిగిలిన సబ్జెక్ట్‌లో పాస్ మార్కులు వేసేవారంటూ వాస్తవాన్ని వెల్లడించారు. ఇది చెప్పగానే... మీరుచెప్పింది విని ఇకపై స్కూల్‌కు పిల్లలు ఎవ్వరూ వెల్లకపోతే స్కూల్స్ మూసేస్తారేమోఅంటూ.. అలీ చలోక్తి విసిరారు.
అందుకే నేను చదివిన విద్య నాకు ఉపయోగపడలేదు. నాకేకాదు ఎవ్వరికీ ఉపయోగపడదు. ప్రతి వారిలోనూ ఓ ప్రతిభ వుంటుంది. దాన్ని పెద్దలు గుర్తించి ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని చాలామంది మేథావులు ఎప్పటినుంచో మొత్తుకుంటూనే వున్నారు. పేరుపొందిన కవులు కూడా మన విద్యావిధానం బానిస విద్యావిధానం అంటూ గేయాలు రాశారు. ఈమధ్య కేంద్రమంత్రులు కూడా విద్యావిధానం మారాలంటూ అప్పుడప్పుడు గుర్తుచేస్తుంటారు. మోడీకూడా ఓ సందర్భంలో విద్యావిధానంపైకూడా స్పందించారు.