Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంజలిని చూసి అసహ్యించుకున్న నర్సు... ఎందుకో తెలుసా?

Advertiesment
actress
, శనివారం, 25 డిశెంబరు 2021 (14:22 IST)
షాపింగ్‌మాల్, జర్నీ సినిమాల్లో నటించి నటిగా మంచి మార్కులు కొట్టేసిన తెలుగమ్మాయి అంజలి వరుస సినిమాలు చేసినప్పటికీ.. ఆమెకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వంటి హిట్టు పడలేదు. అలాగే పల్లెటూరి అమ్మాయి సీతగా నటించిన అంజలి.. ఆ తర్వాత మోడ్రన్ పాత్రలు చేస్తే ప్రేక్షకులు చూడలేకపోయారు. పైగా ఒకసారి మోడల్ డ్రెస్సులో అంజలి హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్‌కి వెళ్ళగా.. అక్కడ లోపల ఉండేటువంటి ఒక నర్సు ఆమెను చూసి చాలా అసహ్యించుకుంటుందట.
 
దాంతో అంజలి ఏమైందని సదరు నర్సుని అడగగా.. అందుకు ఆమె  "మా అత్త సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చూసి మీలాగా తనను ఉండమనేది. కానీ ఇప్పుడు మా అత్తను తీసుకు వచ్చి మిమ్మల్ని చూపించాలని ఉంది.." అంటూ అంజలి డ్రస్సింగ్‌పై సెటైర్లు వేసిందట. నర్సు మాటలను జీర్ణించుకోలేకపోయిన అంజలి ఎంతో అవమానంగా ఫీలై సిగ్గుతో తలదించుకుందట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరోగా మారనున్న అద్దంకి దయాకర్... ఆ సినిమాలో కాంగ్రెస్ నేతలంతా..?