Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ రోడ్లపై కోలీవుడ్ స్టార్ హీరో సైక్లింగ్...

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (13:31 IST)
కరోనా లాక్డౌన్ కారణంగా అనేక తమిళ చిత్రాలు హైదరాబాద్ నగరంలోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగులు జరుపుకుంటున్నాయి. ఇలాంటి చిత్రాల్లో స్టార్ హీరో అజిత్ నటిస్తున్న వలిమై చిత్రం ఒకటి. ఈ చిత్రం షూటింగ్ కోసం అజిత్ క్రమంగా హైదరాబాద్‌కు వస్తున్నారు. 
 
అయితే, ఆయన హైదరాబాద్‌కు వెళ్లినపుడల్లా ఏదో విధంగా మీడియా కంట పడుతున్నారు. ప్రముఖ బైక్ రేసర్ అయిన అజిత్.. గతంలో హైదరాబాద్ నుంచి చెన్నైకు బైక్‌పై వచ్చిన విషయం తెల్సిందే.
 
ఇపుడు భాగ్యనగరి రోడ్లపై సైక్లింగ్ చేస్తూ కనిపించారు. త‌న‌ను ఎవ్వ‌రూ గుర్తు ప‌ట్ట‌కుండా బ్లాక్ అవుట్‌ఫిట్, హెల్మెట్, గాగుల్స్ ధరించాడు. అయితే, ఆయ‌న హైద‌రాబాద్‌కు సినిమా షూటింగ్ కోసం లేదా మ‌రో ప‌ని మీదా రాలేదు. స్నేహితులతో కలిసి సైక్లింగ్ చేయడమంటే అజిత్ ఇష్ట‌ప‌డ‌తాడు.
 
ఆయ‌న త‌మిళ‌నాడు నుంచి కోల్‌కతా వరకు సైక్లింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇందులో భాగంగా హైద‌రాబాద్ రోడ్ల‌పై నుంచి వెళ్లాడు.  హైద‌రాబాద్‌లోని ప‌లు చోట్ల కాసేపు సైకిల్ ఆపి ఆయ‌న విశ్రాంతి తీసుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments