Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట పిల్లలను సినిమాలకు అనుతించరాదు.. షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు!!

ఠాగూర్
మంగళవారం, 28 జనవరి 2025 (12:17 IST)
తెలంగాణ హైకోర్టు సినీ ప్రేక్షకులకు గట్టి షాక్ ఇచ్చింది. రాత్రి పూట 16 యేళ్ల పిల్లలను సినిమాలకు అనుమతించవద్దని స్పష్టం చేసింది. ముఖ్యంగా, పిల్లలు థిధియేటర్స్‌‌లో సినిమా చూసే సమయంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 11 గంటల్లోపు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏళ్లలోపు పిల్లలను సినిమాలకు అనుమతించరాదని స్పష్టం చేసింది. అయితే, దీనిపై అన్ని వర్గాలతో చర్చలు జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. 
 
ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఉదయం 11 గంటల్లోపు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏళ్ల పిల్లలను సినిమాలకు అనుమతించరాదని థియేటర్లకు తెలిపింది. 'గేమ్ ఛేంజర్‌' సినిమా టిక్కెట్ ధరల పెంపును, అదనపు షోలకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 4 పిటిషన్లపై  విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ హైకోర్టు గత ఉత్తర్వుల మేరకు బెనిఫిట్ షోకు అనుమతిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పునః సమీక్షించి, ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతించరాదని నిర్ణయం తీసుకుంటూ జనవరి 11న ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 
 
ప్రజాప్రయోజనాలు, ఆరోగ్యం, రక్షణలను పరిగణనలోకి తీసుకునే భవిష్యత్తులో బెనిఫిట్లకు అనుమతించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. అయితే సినిమాటోగ్రఫీ నిబంధనల ప్రకారం ఉదయం 8.40 లోపు, అర్థరాత్రి 1.30 గంటల తర్వాత సినిమాలకు అనుమతించరాదన్నారు. ముఖ్యంగా మైనర్లను అనుమతించరాదని, లేని పక్షంలో అది వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వివరించారు. 
 
మల్టీప్లెక్స్‌ల్లో చివరి షో అర్థరాత్రి 1.30 గంటల దాకా నడుస్తుందని, ఇందులో మైనర్ల ప్రవేశానికి ఎలాంటి నియంత్రణలు లేవని కోర్టుకు తెలిపారు. 'పుష్ప-2' ప్రదర్శన సమయంలో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి, బాలుడు తీవ్రంగా గాయపడ్డారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సూచించారు. 'పుష్ప-2' అర్థరాత్రిషోకు చిన్న‌పిల్లలతో కలిసి సదరు కుటుంబం సినిమాకు రావటంపై కూడా నెటిజెన్స్ నుంచి మిక్స్‌డ్ ఓపినీయన్స్ వ్యక్తమయ్యాయి. కోర్ట్ ఆదేశాల మేరకు సెకెండ్ షోలకు పిల్లలపై నిషేధాన్ని అమలు చెయటం వల్ల అది కచ్చితంగా వసూళ్లపై ప్రభావం చూపుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lecturer: లెక్చరర్‌ రాజీనామా: చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని సస్పెండ్

కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌: ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోల మృతి

మరో మహిళతో భర్త అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య (video)

Pakistani nationals: రాజస్థాన్‌లో 400 మందికి పైగా పాకిస్తానీయులు

Liquor Scam: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం : మరో కీలక వ్యక్తి అరెస్ట్.. ఎవరతను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments