Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫేక్ కలెక్షన్స్‌‌ను ఇండస్ట్రీ మొత్తం సరిదిద్దుకోవాలి - బ్లాక్ మనీ లేదు: దిల్ రాజు ప్రకటన

Advertiesment
Dil Raju

డీవీ

, శనివారం, 25 జనవరి 2025 (14:20 IST)
Dil Raju
అగ్ర హీరోల సినిమా విడుదల తర్వాత వందల కోట్లు, వేల కోట్లు ప్రచారంలో చూపించడంతో ఐ.టి.దాడులు సహజంగానే జరుగుతాయని ఈ లెక్కలు కరెక్టా? కాదా? అనేది కూడా బయట అనుమానాలున్నాయని దానిపై నేనొక్కడినే మాట్లాడడం భావ్యంకాదు. ఇండస్ట్రీ మొత్తం కూర్చొని చర్చించాల్సిన అవసరం వుందని తెలంగాణా ఎఫ్.డి.సి. ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు అన్నారు.
 
గత మూడురోజులుగా ఆయన ఇంటిపై, ఆఫీసుపై, సోదరుడు, కుమార్తె, భార్య ఇండ్లపై ఐ.టి.సోదాలు జరిగాయి. అనంతరం బేంక్ లావాదేవీలు కూడా పరిశీలించారు. ఫైనల్ గా మూడోరోజు ’మేం ఊహించినదానికంటే మీ దగ్గర అన్నీ సవ్యంగా వున్నాయంటూ’ లిఖితపూర్వకంగా లెక్కలు చూపించి వెళ్ళారని దిల్ రాజు ఐ.టి.అధికారులు ఇచ్చిన స్టేట్ మెంట్ శనివారంనాడు మీడియాకు చూపించారు. మూడు రోజులపాటు సోదాలు జరిగినా పెద్దగా మానుంచి వారు ఆశించింది ఏమీలేదని చెప్పారు. మరి ఐ.టి.వారే చెపితే బాగుంటుందికదా. అన్న ప్రశ్నకు ఆయనదాటవేస్తూ, మా వద్ద దొరికిన కేష్ వివరాలు వివరించారు.
 
నామీద 2008లో ఐ.డి.దాడి జరిగింది. 18 ఏండ్లు అయింది మరలా వచ్చారు. అన్నీ సవ్యంగా వున్నాయంటూ రిపోర్ట్ కూడా ఇచ్చి వెళ్ళారంటూ ఐ.టి. అధికారులు చూపించిన రిపోర్ట్ చూపించారు. అలాగే మ్ ఛేంజర్ కు ఇంత ఖర్చయింది. ప్రొడక్షన్, ఎగ్జిబిటర్, పంపిణీ వ్యవస్థ వ్యాపారాలు వుండడంతో వాటి గురించి వివరాలు సేకరించారు. దానిని పలు మీడియాల్లో రకరకాల కథనాలు వచ్చాయి. అనవసరంగా ఊహించుకుని వార్తలు రాయకండి అంటూ మీడియాకు బోధించారు.
 
మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు నిజమేనా?
అవును. అందరినీ ఒకచోట పెట్టి ఐ.టి. వివరాలు రాబట్టుకోవడానికి ఇంటిలోనే వుండమంటారు.
మీ సినిమాకు క్యాష్  ఎక్కడనుంచి తెస్తున్నానేది అడిగారా?
ఏ సినిమాకైనా బ్యాంక్ నుంచి కేష్ తీసుకుంటాం. ఆ వివరాలు అన్నీ వారికి చూపించాం. 
మీ దగ్గర గానీ, బంధువుల దగ్గరకానీ క్యాష్ దొరకలేదా?
నా దగ్గర ఐదు లక్షలు, నా సోదరుడు దగ్గర నాలుగున్నర లక్షలు, నా భార్య దగ్గర ఆరు లక్షలు, నా కుమార్తె దగ్గర 6 లక్షలు, ఆఫీసులో రెండు లక్షలు వున్నాయి. వాటి వివరాలు తీసుకున్నారు. మొత్తంగా  20 లక్షలు లోపే కేష్ వుంది. నా భార్య దగ్గర 77 లక్షలు బంగారం రూపంలో వుంది.
 
మీ సినిమాలకు ఎన్.ఆర్.ఐ., రాజకీయనాయకుల నుంచి ఆర్థిక సాయం వస్తుందనేటాక్ వుంది?
అలాంటివి ఏమీలేవు. ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి. ఇప్పటికే బేంక్ వాళ్ళనుంచి వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నా అంటూ సెటైర్ వేశారు.
 
అధికారుల మీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడానికి కారణం?
నాతోపాటు మైత్రీ మూవీ మేకర్స్, అబిషేక్ అగర్వాల్ ఇండ్ల పైనా సోదాలు జరిగాయి. కానీ నన్నే మీడియా ఎక్కువ ఫోకస్ చేసింది. వ్యాపారాలు చేస్తున్న‌ప్పుడు ఐటీ సోదాలు స‌ర్వ‌సాధార‌ణం అని చెప్పారు. తాను సెల‌బ్రిటీని కాబ‌ట్టే మీడియా అంతా త‌న‌పై ఫోక‌స్ పెట్టింద‌న్నారు.
 
మీరు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని వార్తలు వచ్చాయి?
అవన్నీ మీ కల్పితాలే. మా మా అమ్మకి లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల చికిత్స తీసుకున్నారు. అందుకే ఆసుపత్రికి వెళ్ళాను. ఏదో వార్తలు మీరే రాసేశారు.
 
బ్లాక్ మనీపై మాట్లాడుతూ, ఇక ఫేక్ కలెక్షన్స్‌ వల్లే ఐటీ సోదాలు జరుగుతున్నాయని దానిపై ఇండ‌స్ట్రీలో అంద‌రం క‌లిసి కూర్చోని మాట్లాడుతామ‌ని చెప్పారు. తాను ఒక్క‌డినే వ్య‌క్తిగ‌తంగా దీనిపై కామెంట్ చేయ‌న‌ని చెప్పారు. ఒక‌వేళ అలాంటి ఏదైనా ఉంటే త‌ప్ప‌కుండా ఇండ‌స్ట్రీ త‌రుపున స‌రిద్దాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో అంతా ఆన్‌లైన్ బుకింగ్‌, ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్స్ జ‌రుగుతున్నాయి. ఇక బ్లాక్ మ‌నీ స‌మ‌స్య లేదు అని దిల్‌రాజు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవుడు ఉన్న చోట దెయ్యం ఉంటుంది అంటూన్న సుధీర్ బాబు