Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నారి నారి నడుమ మురారి' చిత్ర నిర్మాత కె.మురారి ఇకలేరు.. నేడు అంత్యక్రియలు

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2022 (08:57 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ నిర్మాతల్లో ఒకరైన కాట్రగడ్డ మురారి అలియాస్ కె.మురారీ ఇకలేరు. ఆయన శనివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయనకు రెండుసార్లు బైపాస్ సర్జరీ చేశారు. శనివారం రాత్రి భోజనం చేసి తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సమయంలో మూడో సారి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగానే తుదిశ్వాస విడిచారు. ఆయనకు వయస్సు 78 యేళ్లు. చెన్నై, ఈసీఆర్ రోడ్డు, నీలాంకరై, కపాలీశ్వర్ నగరులో ఉన్న ఆయన నివాసంలోనే కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో జరుగనున్నాయి. ఆయనకు భార్య, కుమార్డు కార్తీక్ ఉన్నారు. 
 
విజయవాడ మొగల్రాజపురానికి చెందిన మురారి చిన్నప్పటి నుంచే సంగీతం, సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లో సినిమాలు చూసి వాటిపై సమీక్షలు, వ్యాసాలు రాసేవారు. ఎంబీబీఎస్ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు దానిని వదిలేసి సినిమాలపై ఆసక్తితో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. 
 
తన బాబాయి శ్రీనివాసరావు ప్రోత్సాహంతో దర్శకుడు మధుసూదనరావు వద్ద 1969లో సహాయ దర్శకుడిగా చేరారు. ‘మనుషులు మారాలి’ సినిమాకు తొలిసారి పనిచేశారు. ఆ తర్వాత దర్శకుడు చక్రపాణితో ఏర్పడిన పరిచయం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. వి.మధుసూదనరావు, ఆదుర్తి సుబ్బారావు, బాలచందర్, సేతుమాధవ్, బాపు వంటి ప్రముఖుల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసి అనుభవం సంపాదించారు. 
 
ఆ తర్వాత 'యువ చిత్ర ఆర్ట్స్' పేరుతో బ్యానర్ స్థాపించి ‘సీతామాలక్ష్మి’, ‘గోరింటాకు’, ‘త్రిశూలం’, ‘అభిమన్యుడు’, ‘సీతారామ కల్యాణం’, ‘శ్రీనివాస కల్యాణం’, 'జే గంటలు',  ‘జానకి రాముడు’, ‘నారీనారీ నడుమ మురారి’ వంటి హిట్ సినిమాలు నిర్మించారు. మురారి మరణవార్త విని సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతికి సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. తెలుగు చిత్రపరిశ్రమ పూర్తిగా హైదరాబాద్ నగరానికి తరలి వెళ్లినప్పటికీ తనకు అన్నీ ఇచ్చిన చెన్నైలోనే ఆయన స్థిరపడిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకి రూ. 50 లక్షలు విరాళం ఇస్తున్నా: పవన్ కల్యాణ్

తల్లితో పక్కింటి అంకుల్ అక్రమ సంబంధం: కరెంట్ వైర్ షాకిచ్చి హత్య

Elon Musk 13th Child: నా బిడ్డకు ఎలెన్ మస్క్ తండ్రి.. మీడియా అలా చేయవద్దు

9 నెలల క్రితం 17ఏళ్ల బాలిక కిడ్నాప్- యూపీలో దొరికింది.. కానీ పెళ్లైంది.. ఎవరితో?

జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు.. క్షమాపణ చెప్పినా నో యూజ్.. చర్యలు తప్పవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments