టాలీవుడ్‌లో నెక్స్ట్ జనరేషన్ నట వారసుల ఎంట్రీలు షురూ!

ఠాగూర్
మంగళవారం, 27 ఆగస్టు 2024 (16:00 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో తదుపరి తరం నట వారసుల ఎంట్రీలు ప్రారంభమైపోయాయి. కొంతకాలం క్రితం వరకు హీరోగానే తన వారసులను హీరోలు వెండితెరకు పరిచయం చేసేవారు. కానీ, ఇపుడు మారిన కాలమాన పరిస్థితుల నేపథ్యంలో నేటితరం హీరోలు కుడా తమ పంథాను మార్చుకున్నారు. నేటి ట్రెండ్‌కు అనుగుణంగా తమ పిల్లల వయసుతో పనిలేకుండా వారి వయసుకు తగిన పాత్రలు ఉంటే చాలు సినిమాల్లో నటింపజేసేందుకు ప్రోత్సహిస్తున్నారు. 
 
ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నారు. కానీ సమయం తీసుకుని ఈ  సెప్టెంబరు నెలలో తన తొలి సినిమాను అనౌన్స్ చేయనున్నారు. ప్రశాంత్ వర్మ‌ దర్శకత్వంతో నందమూరి అభిమానులు అంచనాలను రీచ్ అయ్యే పాత్రలో మోక్షజ్ఞ కనిపించనున్నాడు. 
 
ఇక ఇప్పటికే మహేశ్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ బాలనటుడిగా ఓ సినిమాలో నటించగా పూర్తి స్దాయి హీరోగా రావటానికి ఇంకాస్త సమయం పట్టనుంది. మహేష్ కుమార్తె సితార నటికాకముందే సోషల్ మీడియాలో ఫేమస్.. ఆమె వయస్సుకు తగ్గ కథ ఉంటే నటిగా ఎంకరేజ్ చెసెందుకు మహేష్ నమ్రత సిద్దంగానే ఉన్నారు. 
 
అల్లు అర్జున్ కూతురు కూడా 'శాకుంతలం' సినిమాలో నటించి మెప్పించింది. బన్నీ కుమారుడు అయాన్ సైతం‌ ఆర్టిస్ట్ కాకున్నా.. మోడల్ ట్యాగ్‌తో సపరేట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేస్తుకున్నాడు. హీరో సుధీర్ బాబు తనయులు కూడా బాలనటులుగా రాణిస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు మంచు కుటుంబం‌ నుంచి మూడో తరాన్ని కూడా పరిచయం చేస్తున్నారు. 'కన్నప్ప'లో బాల తిన్నడుగా మంచు అవ్రామ్ ఎంట్రీని రివీల్ చేశారు.
 
వీరేకాక నందమూరి హరికృష్ణ మనవడు జానకీరామ్ కుమారుడు ఎన్టీఆర్‌ను కూడా వైవీఎస్ చౌదరి హీరోగా పరిచయం చేస్తున్నారు.‌ మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు తనయుడైన జయకృష్ణ కూడా నటుడిగా పరిచయం కానున్నాడు. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వరుస సినిమాలు చెస్తూనే ఉన్నాడు. 
 
రవితేజ కుమారుడు మహాదాన్ కొన్ని సినిమాల్లో నటించారు. రాజశేఖర్, జీవితల కూతురు శివానీ, శివాత్మికలు కూడా సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇలా సీనియర్ జూనియర్‌లు అన్న తేడా లేకుండా హీరోలు నటులు తమ పిల్లల యాక్టింగ్ ఇంట్రెస్ట్‌ను వయస్సుతో నిమిత్తం లేకుండా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన

పాలిటిక్స్‌ను పక్కనబెట్టి హరీష్ రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత

భిక్షాటన నివారణ చట్టం అమల్లోకి... ఇకపై ఏపీలో భిక్షాటన చేసేవాళ్లను...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments