Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

Advertiesment
Bimbisara2 poster

డీవీ

, శుక్రవారం, 5 జులై 2024 (19:58 IST)
Bimbisara2 poster
డైనమిక్‌ హీరో - నిర్మాత నందమూరి కల్యాణ్‌రామ్‌ ఇప్పుడు కెరీర్‌లో అద్భుతమైన ఫేజ్‌లో ఉన్నారు. అత్యంత వైవిధ్యమైన స్క్రిప్టులు సెలక్ట్ చేసుకుంటూ, తనదైన శైలిలో విలక్షణంగా దూసుకుపోతున్నారు. కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో అత్యంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా బింబిసార.
 
బింబిసార పార్ట్ 2 ఉంటుందని మేకర్స్, యూనిట్‌ ఎప్పుడో ప్రకటించింది. మరి అప్పుడు ప్రకటించిన ఆ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు ఆనందాన్ని పంచే వార్త వచ్చేసింది. బింబిసార ప్రీక్వెల్‌ని అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. కల్యాణ్‌రామ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ అనౌన్స్ మెంట్‌ వచ్చేసింది. క్రియేటివ్‌ కాన్సెప్ట్ పోస్టర్‌తో ఈ విషయాన్ని వెల్లడించారు. 'బింబిసార కన్నా యుగాల ముందు త్రిగర్తలను ఏలిన లెజెండ్‌ని చూడడానికి సిద్ధంగా ఉండండి' అంటూ ప్రీక్వెల్‌ని అనౌన్స్ చేశారు మేకర్స్.
 
బింబిసార సినిమాలో కల్యాణ్‌రామ్‌ బింబిసారగా కనిపించారు. ప్రీక్వెల్‌లో అంతకు మించిన అద్భుతమైన కథను ప్రేక్షకులతో పంచుకోనున్నారు. దానికి తగ్గట్టే ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. స్క్రిప్టు విషయంలో ప్రతి స్టేజ్‌లోనూ ఆ ఎగ్జయిట్‌మెంట్‌ను ఆస్వాదిస్తోంది యూనిట్‌. బింబిసార2కి ప్రాణం పోయడానికి అన్ని విధాలా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. స్క్రీన్‌ మీద ఇప్పటిదాకా ఎవరూ చూడనటువంటి స్థాయిలో త్రిగర్తలను ప్రదర్శించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
 
'రొమాంటిక్‌' సినిమాను తెరకెక్కించిన అనిల్‌ పాదూరి బింబిసార2కి దర్శకత్వం వహించనున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది.  అత్యంత భారీ స్థాయిలో, అత్యంత ఉన్నతమైన సాంకేతిక పనితనంతో కనువిందు చేసే దృశ్యకావ్యంగా తీర్చిదిద్దడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుపుకుంటోంది బింబిసార2. అతి త్వరలో సినిమాను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌