Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు షాక్: బ్లాక్ ఫిల్మ్‌తో తంటా.. రూ.700లు జరిమానా

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (10:27 IST)
తెలుగు చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. త్రివిక్రమ్ కారును జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. 
 
సోమవారం జూబ్లీహిల్స్‌లో వాహన తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉన్న ఓ కారును గమనించి ఆపారు. ఆ సమయంలో కారులో దర్శకుడు త్రివిక్రమ్ ఉన్నారు. 
 
నిబంధనల ప్రకారం కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండకూడదని ఆయనకు సూచించిన పోలీసులు దాన్ని అక్కడిక్కడే తొలగించి రూ.700లు జరిమానా విధించారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో మరికొందరు ప్రముఖుల కార్లకు సైతం బ్లాక్ ఫిల్మ్ ఉండటాన్ని గుర్తించిన పోలీసులు వారికి సైతం జరిమానా విధించారు.
 
ఇదిలా ఉంటే మార్చి 31న టోలీచౌకి వద్ద న‌టుడు మంచు మ‌నోజ్ కారును ఆపిన పోలీసులు టింటెడ్ గ్లాస్ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.700 జరిమానా విధించిన సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే.. టింటెడ్ గ్లాస్ వాడకాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. వాహనం కిటికీ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని పేర్కొంది. కానీ కొంతమంది సెలబ్రిటీలు తమ గోప్యత కోసం అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వినియోగిస్తున్నారు. అయితే ఇది ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అరిఘాత్‌ నుండి కే-4 క్షిపణి ప్రయోగం విజయవంతం

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

కానిస్టేబుల్ కర్కశం... కన్నతల్లిని కొట్టి చంపేశాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments