Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ కంటెస్టెంట్లు వీరేనా?

ఠాగూర్
శనివారం, 31 ఆగస్టు 2024 (10:23 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ రియాలిటీ షో బాగా పాపులర్ అయింది. ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆదివారం నుంచి అట్టహాసంగా ప్రారంభంకానుంది. ఈ బిగ్ బాస్ రియాలిటీ షోకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. షోలో ఈసారి ఎంత మంది పార్టిసిపేట్ చేస్తున్నారు.. ఫస్ట్ ఫేజ్‌లో ఎంత మంది లోపలికి వెళతారు. ఎవరెవరు కన్ఫర్మ్ అవుతారు అనే దానిపై సోషల్ మీడియాలో రకరకాలుగా ఊహగానాలు చెలరేగుతున్నాయి.
 
సాధారణంగా బిగ్ బాస్‌లో ఎప్పుడూ కూడా 15 మందికి పైగా కంటెస్టెంట్‌లు ఉంటారు. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుందని సమాచారం. మొదటి దశలో 14 మందిని పంపిస్తున్నారు. అయితే 15 వారాల షోకి 14 మందిని తీసుకుంటే చాలా మందిని వైల్డ్ కార్డు ద్వారా లోపలికి పంపాల్సి ఉంటుంది. దాదాపు 5 నుంచి 6 మంది హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉంటుంది.
 
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం మేరకు.. తన ఇన్‌స్టా వీడియోల ద్వారా పాపులర్ అయిన బేబక్క, హీరో ఆదిత్య ఓం, కృష్ణ ముకుందా మురారి సీరియల్ ద్వారా ఫేమస్ అయిన యష్మి గౌడ, ప్రేరణ కంభం, విష్ణు ప్రియ, అభయ్ నవీన్, ఢీనైనిక, కిర్రాక్ సీత బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా సమాచారం.
 
అలానే శేఖర్ బాషా, నాగమణికంఠ, నిఖిల్ కూడా మంచి పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్స్‌గా భావిస్తున్నారు. తొలుత రీతూ చౌదరి, తేజస్విని గౌడ, అంజలి పవన్, ఇంద్రనీల్, కుమారి ఆంటీ, రామిశెట్టి, కిరాక్ ఆర్పీ లు బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్‌లుగా ఉంటారని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. అయితే వీరు ఎవరూ హౌస్‌లోకి వెళ్లడం లేదన్నది తాజా సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

దేశంలో జమిలి ఎన్నికలు తథ్యం.. అమలుకు ప్రత్యేక కమిటీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముంబై నటినే కాదు.. ఆమె సోదరుడిని కూడా వేధించిన పీఎస్ఆర్ ఆంజనేయులు

బోను తాళం పగలగొట్టుకొని మరీ బయటకు వచ్చిన పులి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments