Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఒట్టు' ... కేరళకు మకాం మార్చిన వరంగల్ బ్యూటీ!

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (20:19 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న ఒకరిద్దరు తెలుగు హీరోయిన్లలో ఈషా రెబ్బా ఒకరు. చిన్నచిన్న పాత్రలతో తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ తెలుగుపిల్ల... హీరోయిన్‌గా నిలదొక్కుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. 
 
ఈ భామ ఇటీవ‌ల సోష‌ల్‌మీడియాలో గ్గామ‌ర‌స్‌, స్టైలిష్ స్టిల్స్‌ను పోస్ట్ చేయ‌గా.. ఆ ఫొటోలు కుర్ర‌కారుకు నిద్ర‌ప‌ట్ట‌కుండా చేశాయి.. చేస్తున్నాయి. చివ‌రిసారిగా తెలుగులో "అర‌వింద స‌మేత" లాంటి పెద్ద చిత్రంలో సెకండ్ లీడ్ రోల్‌లో క‌నిపించింది. 
 
అయితే ఆ త‌ర్వాత 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' మిన‌హా ఈ భామకు తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో త‌మిళం, మ‌ల‌యాళంపై దృష్టి పెట్టింది. ఈషారెబ్బా మ‌ల‌యాళంలో "ఒట్టు" అనే చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఈ విష‌యాన్ని ట్విట్టర్ ద్వారా తెలియ‌జేస్తూ ఎక్జ‌యిటెడ్‌గా ఉంద‌ని ట్వీట్ చేసింది.
 
మ‌రోవైపు త‌మిళ సినిమాలో కూడా న‌టిస్తోంది. ఈషారెబ్బా త‌న మ‌కాంను కేర‌ళ‌కు మార్చేసిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్‌లో జోరుగా టాక్ న‌డుస్తోంది. మ‌రి కేర‌ళ కుట్టీలు తెలుగులో రాణిస్తున్న‌ట్టే.. ఈషా రెబ్బా కూడా మాలీవుడ్‌లో పాగా వేయాల‌ని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ ఈషా రెబ్బా అంటూ విషెస్ చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments