Webdunia - Bharat's app for daily news and videos

Install App

పావు శాతం కాలేయంతో జీవిస్తున్న బాలీవుడ్ సూపర్ స్టార్

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (16:34 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఇది ఆయన ఆరోగ్యానికి సంబంధించిన విషయం. తాను 25 శాతం కాలేయంతోనే జీవిస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. తాజాగా బిగ్ బీ స్వస్థ్ ఇండియా అనే కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
'ఒకప్పుడు నాకు క్షయ(టీబీ), హెపటైటిస్‌ బీ వ్యాధులు ఉండేవి. అయితే నాకు ఈ వ్యాధులు సోకినట్లు దాదాపు ఎనిమిదేళ్ల పాటు నేను గుర్తించలేకపోయాను. హెపటైటిస్‌ వల్ల అప్పటికే నా కాలేయం 75 శాతం పాడైంది. తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల ఇలా జరిగింది. 
 
ప్రస్తుతం నేను 25 శాతం కాలేయంతోనే జీవిస్తున్నాను. టీబీకి చికిత్స ఉంది. కానీ ముందుగా గుర్తించకపోవడం వల్ల నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. తరచుగా వైద్య పరీక్షలు చేయించుకుంటుంటే.. ఇలాంటి వ్యాధుల్ని ముందుగానే పసిగట్టవచ్చు. తగిన చికిత్స తీసుకోవచ్చు' అని చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే, 'నాలా మరొకరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఇప్పుడీ విషయాల గురించి వెల్లడించాను. అంతేకానీ, నేనోదో గొప్పకు చెప్పుకుంటానని మాత్రం భావించవద్దు. ప్రతి ఒక్కరు తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఫలితంగా వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి సులభంగా నివారించవచ్చు' అని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్.. ప్రేమ పేరుతో హోటల్‌కు తీసుకెళ్లాడు.. ఆపై అత్యాచారం

కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించిన టీడీపీ మంత్రి సోదరుడు (వీడియో)

సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతల పరువునష్టం కేసు.. కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

గుమస్తా ఉద్యోగి నెల వేతనం రూ.15 వేలు.. ఆస్తులు రూ.30 కోట్లు

Anil Ambani: రూ.17,000 కోట్ల రుణ మోసం కేసు.. అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసిన ఈడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments