Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజల జావేరి భర్త తరుణ్ అరోరాతో చిరంజీవి ఫైటింగ్.. ఎందుకో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్‌ని కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాలో చిరంజీవి జోడీగా నటించే హీరోయిన్ ఎవరనేదానిపై ఇంకా క్లారిటీ లేదనే చెప్పాలి. వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (13:58 IST)
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్‌ని కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాలో చిరంజీవి జోడీగా నటించే హీరోయిన్ ఎవరనేదానిపై ఇంకా క్లారిటీ లేదనే చెప్పాలి. వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుటున్న ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్ర కోసం తొలుత బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ అనుకున్నా ఆఖ‌రికి ఆ అవ‌కాశం త‌రుణ్‌కు ద‌క్కింద‌ట‌. ఈ తరుణ్ ఎవరో కాదు.. చూడాల‌ని ఉంది సినిమాలో చిరుతో జతకట్టిన అంజల జావేరి భర్తే కావడం విశేషం. అంజల జావేరి అటుపై ''శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్"లోను తళుక్కుమంది.
 
తమిళ థ్రిల్లర్ ''గణిదన్'' సినిమాలో తరుణ్ అద్భుత నటనను చూసి వినాయక్ చిరంజీవి 150వ సినిమాలో విలన్‌గా ఎంపిక చేశారని తెలిసింది. ఇంకొద్ది రోజుల్లో తరుణ్ తెలుగు కత్తి రీమేక్ షూటింగ్‌లో పాల్గొంటాడని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. ఇక తరుణ్ ఈ సినిమా కోసం అగ్రిమెంట్లో సంతకాలు కూడా చేసేశాడని తెలిసింది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి చిరంజీవి 150వ సినిమా తెరపైకి రానుంది.

ఈ చిత్రాన్ని చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకేముంది..? తరుణ్ విలన్‌గా ఓకే కావడంతో.. అంజల భర్తైన అతనితో చిరంజీవి ఫైట్ చేయనున్నారన్నమాట. అంతేకాదండోయ్ చిరంజీవి బర్త్ డే ఫంక్షన్‌కు కూడా అంజల తన భర్తతో పాటు హాజరైంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh Meets PM: ఢిల్లీలో ప్రధానిని కలిసిన నారా లోకేష్ ఫ్యామిలీ

Duvvada Srinivas: దివ్వెల మాధురితో దువ్వాడ శ్రీనివాస్ నిశ్చితార్థం.. ఉంగరాలు తొడిగారుగా! (video)

జమ్మూలో బాధ్యతలు.. సిద్ధిపేటలో భూ వివాదం... జవానుకు కష్టాలు.. తీరేదెలా?

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments