Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఘవేంద్రరావుకు తాప్సీ సారీ చెప్పేసింది.. ఆనందో బ్రహ్మ టీజర్‌ వచ్చేస్తోంది..

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుపై వివాదాస్పద కామెంట్లు చేసిన తాప్సీ వెనక్కి తగ్గింది. రాఘవేంద్రరావు పండ్లు, కొబ్బరి చిప్పలతో నాభిపై కొట్టడం ద్వారా అసలేం రొమాన్స్ వుందంటూ కామెంట్స్ చేసిన తాప్సీ ఆపై తన వ్యా

Webdunia
శనివారం, 15 జులై 2017 (16:33 IST)
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుపై వివాదాస్పద కామెంట్లు చేసిన తాప్సీ వెనక్కి తగ్గింది. రాఘవేంద్రరావు పండ్లు, కొబ్బరి చిప్పలతో నాభిపై కొట్టడం ద్వారా అసలేం రొమాన్స్ వుందంటూ కామెంట్స్ చేసిన తాప్సీ ఆపై తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేయలేదు. ఆయన చేసిందే చెప్పానంది. అయితే తాజాగా రాఘవేంద్రరావుకు క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి రాఘవేంద్రరావును క్షమించాల్సిందిగా కోరింది. 
 
తొలుత తన మాటలను సమర్థించుకున్న తాప్సీ.. ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలన్నీ మనస్ఫూర్తిగా చెప్పినవి కాదని.. వాటిని అర్థం చేసుకోలేక తప్పుదోవ పట్టించారని వ్యాఖ్యానించింది. ఏదీ ఏమైనా క్షమించమని కోరింది. తనపై తాను జోకులు వేసుకుంటున్నా అనుకున్నానే కానీ.. ఇంత గొడవకు దారితీస్తాయని అనుకోలేదని.. తనకు లైఫ్ ఇచ్చిన దర్శకేంద్రుని గురించి తప్పుగా ఎలా మాట్లాడతానని వీడియోలో పేర్కొంది.
 
రాఘవేంద్ర రావుకు తాప్సీ చెప్పడంతో ''ఆనందో బ్రహ్మ'' సినిమా నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. తాప్సీ కామెంట్స్‌తో ఆమెను బహిష్కరించాలని వ్యతిరేకత వ్యక్తమైన తరుణంలో.. తాప్సీ సారీ చెప్పేసింది. ఈ నేపథ్యంలో 'ఆనందో బ్రహ్మ' అంటూనే భయపెట్టడానికి మరో హారర్ థ్రిల్లర్ వచ్చేస్తోంది.

తాప్సి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి, షకలక శంకర్ తదితరులు నటించారు. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 19వ తేదీన రిలీజ్ చేసి, సినిమాను ఆగస్టు 18వ తేదీన విడుదల చేయాలనుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments